తమన్ ఎంకరేజ్ చేస్తున్న ఆ అంధ గాయకుడు ఎవరు, నేపధ్యం ఏమిటి

First Published | Nov 19, 2024, 1:12 PM IST

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంధ గాయకుడి పాటకు సంగీత దర్శకుడు తమన్ స్పందించి, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-4లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ వీడియోను షేర్ చేసి కీరవాణిని ట్యాగ్ చేయగా, తమన్ స్పందించి ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

Thaman, keeravani, blind singer


అప్పట్లో  నెట్టిట్లో  కచా బాదం (kacha badam) సాంగ్ ఎంతలా ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పశ్చిమ బెంగాల్‌లోని భీర్బూమ్‌కి చెందిన భూబన్‌ అనే ఓ పల్లీల వ్యాపారి సరదాగా పాడిన ఈ పాట సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌.. ఎక్కడ చూసినా ఈ పాటే దర్శనమిచ్చింది.  చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ పాటను తెగ ఎంజాయ్ చేసారు. సెలబ్రెటీలు సైతంఈ పాటకు ఫిదా అయ్యి తమ స్టైల్లో స్టె్ప్పులేసారు. ఇక ఈ ట్రెండీ సాంగ్‌కు రీక్రియేషన్లు, స్ఫూప్‌లు కూడా వచ్చేసాయి.  అలా ఎవరికి పెద్దగా తెలియని పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాపులర్ అయ్యారు. సోషల్ మీడియా గొప్పతనం ఇది.


ఇదే క్రమంలో సోషల్ మీడియా ద్వారా మరో  మట్టిలో మాణిక్యం  బయిటకు వస్తున్నాడు. గతంలో తమ టాలెంట్ తో అంగ వైకల్యాన్ని సైతం జయిస్తున్న వారూ చాలా మందే ఉన్నారు.

మ‌నం చూడాలే కానీ.. ఇలాంటి మ‌ట్టిలో మాణిక్యాలు ఎన్నో.. అంటూ ఓ అంధ యువకుడు అద్భుతంగా పాడిన పాట ఒకటి తెలంగాణ రాష్ట్ర ఆర్.టి.సి. ఎమ్.డి. సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు.. ఎమ్.ఎమ్.కీరవాణిని ట్యాగ్ చేస్తూ.. అతనికొక అవకాశం ఇచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేశారు. అది చాలా పాపులర్ అయ్యింది.  


Thaman


అయితే ఆయన షేర్ చేసిన ఈ వీడియోకి కీరవాణి నుంచి ఇంకా స్పందన రాకపోయినా.. మరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-4 లో అతనికి అవకాశం ఇచ్చేందుకు కృషి చేస్తానని సోషల్ మీడియా వేదికగా మాటిచ్చాడు.

తన రిక్వెస్ట్ ను పరిశీలించాల్సిందిగా ఆహా ని కోరాడు. అంతేకాదు.. ఆ అంధుడితో కలిసి తాను కూడా పెర్ఫామ్ చేస్తానని ఈ సందర్భంగా తన పోస్ట్ లో తెలిపాడు. ఇంతకీ ఆ సింగర్ ఎవరు..ఎక్కడివారు... ఆయన నేపధ్యం ఏమిటో చూద్దాం.


ఆ అంధ గాయకుడు పేరు రాజు. ఈ మధ్యనే వసంతలక్ష్మి, బుచ్చయ్య, రామా చారి గార్ల దగ్గర  ఆయన సంగీతం నేర్చుకుంటున్నారు. జయకుమార్ దగ్గర తబలా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. బయిట పోగ్రామ్ లు చేసారు కానీ టీవీల్లో ఎప్పుడూ పోగ్రామ్ లు చేయలేదు. చదువుకోలేదు. పాటలు పాటడం ఇష్టం. తన చుట్టుప్రక్కన టేప్ రికార్డ్ ల్లో పాటలు విని పాడుకోవటం మొదలెట్టాను అన్నారు. పలాస సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పారు. మ్యూజిక్ డైరక్టర్ రఘుకుంచె చూసారు. ఆయనే ఎడ్రస్ తెప్పించుకున్నారు.

అలా పలాస సినిమాలో  శ్రీకాకుళం యాసలో టైటిల్ సాంగ్  పాడించారు. ఆ తర్వాత కరోనా వచ్చి ఆగిపోయింది. ఆఫర్స్ ఏమీ రాలేదు అని అన్నారు. ఫైనాన్సియల్ స్టేటస్ గొప్పగా ఏమీలేదు. తండ్రి లేరు, తల్లి తెచ్చిపెట్టే ఆదాయంతోనే తాము బ్రతుకుతున్నాము అన్నారు. ఒక పెంకిటిల్లు ఉంది. అది కూలేలా ఉంది. తన తల్లి తర్వాతే ఎవరైనా తన తల్లికు ఏమైనా చెయ్యాలి అని అన్నారు. తమన్ స్పందించిన విషయమై మాట్లాడుతూ చాలా ఆనందం అన్నారు. 


ఆ అంధ గాయకుడిని ఉద్దేశించి సంగీత దర్శకుడు తమన్ (Thaman) పోస్ట్ పెట్టారు. అతడు కచ్చితంగా ఇండియన్ ఐడల్లో పాడతాడని హామీ ఇచ్చారు. ఈమేరకు ఈ కార్యక్రమం ప్రసారమయ్యే ఓటీటీ సంస్థను తమన్ రిక్వెస్ట్ చేశారు..

ఈ అబ్బాయ్ కచ్చితంగా ఇండియన్ ఐడల్ సీజన్ 4లో (Indian Idol) పాడతాడు. అతడికి గొప్ప టాలెంట్ ఉంది. ఆ వేదికపై అతడితో కలిసి నేను ప్రదర్శన ఇస్తాను. శ్రుతిలో ఎంత స్పష్టంగా పాడుతున్నాడో.. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అయితేనేం.. అతడి టాలెంట్ను గుర్తించి అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా.. అని పోస్ట్ తమన్ పేర్కొన్నారు.  


ఇక  సజ్జనార్ తమన్ కి థ్యాంక్స్ చెప్పారు.. తన ట్విట్టర్ వేదికగా.. "అద్భుత‌మైన కంఠంతో పాట‌లు ఆల‌పిస్తోన్న ఈ అంధ యువ‌కుడికి 'ఆహా' నిర్వహిస్తోన్న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ లో అవ‌కాశం ఇచ్చేలా చూస్తాన‌ని ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు తమన్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.

ఈ అవ‌కాశంతో అద్భుత‌మైన త‌న టాలెంట్‌కు మ‌రింత‌గా గుర్తింపు ద‌క్కుతుంది. భవిష్యత్ లో త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల‌ను చేస్తూ ఈ యువకుడు ఉన్న‌తంగా ఎదుగుతార‌ని ఆశిస్తున్నాను" అంటూ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos

click me!