ముఖంపై ముడతలను పోగొట్టే అద్బుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం

First Published Jan 31, 2023, 2:54 PM IST

ముఖంపై ముడతలు ఉంటే పెద్దవయసు వారిలా కనిపిస్తుంటారు. అందం కూడా తగ్గుతుంది. వయసుతో పాటుగా సూర్య కిరణాలు, సిగరేట్, ఆల్కహాల్, కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా ముఖంపై ముడతలు వస్తాయి. అయితే కొన్ని ఫేస్ ప్యాక్ లతో ముఖంపై ముడతలను ఇట్టే తొలగిపోతాయి. 

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మొటిమలు, మొటిమల మచ్చలు, తెల్ల, నల్ల మచ్చలు, ముడతలు వంటి సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ చర్మ సమస్యల వల్ల అందం తగ్గడమే కాదు మీరు పెద్దవయసు వారిలా కూడా కనిపిస్తారు. అయితే కొన్ని నేచురల్ ఫేస్ ప్యాక్ తో ఈ చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇవి మీ చర్మాన్ని  అందంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మరి ఇందుకోసం ఫేస్ ప్యాక్ లను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫేస్ ప్యాక్ కు కావాల్సిన పదార్థాలు

బంగాళాదుంప రసం- 2 టీస్పూన్లు
పసుపు - 1/2 టీస్పూన్
టమోటా జ్యూస్ -2 టీస్పూన్లు

ఫేస్ ప్యాక్ ను తయారుచేసే విధానం.. 

ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో రెండు టీస్పూన్ల బంగాళాదుంప రసాన్ని పోయండి. దీనిలో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలపండి. ఆ తర్వాత అందులోనే రెండు టీస్పూన్ల టొమాటో రసాన్ని పోయండి. వీటన్నింటినీ బాగా కలగలపండి. ఈ ప్యాక్ ను ముఖమంతటా బాగా అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు.
 

బంగాళాదుంపలలో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి నేచురల్ గ్లో ఇస్తుంది. బంగాళాదుంపలను తినడం వల్ల హైపర్పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, మచ్చలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే టమోటాల్లో విటమిన్ సి, విటమిన్ ఇ , బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ టమాటాలు చర్మానికి సహజ మెరుపును, రంగును ఇవ్వడానికి సహాయపడుతుంది.

ఇకపోతే పసుపును ప్రకాశాన్ని ఇచ్చే శక్తివంతమైన పదార్థంగా కూడా భావిస్తారు. పసుపులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.  ఇది హైపర్పిగ్మెంటేషన్, మచ్చలు, నల్ల మచ్చలను తొందరగా తగ్గిస్తుంది. పసుపులో ఉండే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు చర్మానికి సహజ మెరుపును ఇస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అందుకే చర్మ సమస్యలు ఉన్నవారు ఈ ఫేస్ ప్యాక్ ను తప్పకుండా ఉపయోగించండి.  

click me!