చలికాలంలో మెంతికూరను తినడం వల్ల డయాబెటీస్ ఒక్కటే కాదు.. ఆ సమస్యలన్నీ పరార్..

First Published Dec 8, 2022, 1:54 PM IST

డయాబెటీస్ పేషెంట్లలో చాలా మందికి ఏవి తినాలో.. ఏవి తినకూడదలో అస్సలు తెలియదు. ఇలాంటి వారే తినకూడనివి తింటూ ఇబ్బంది పడుతుంటారు. అయితే మధుమేహులు చలికాలంలో మెంతి ఆకులను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సే ఉండదు.  
 

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటికీ మెంతి ఆకులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్ డయాబెటిక్ రోగుల శరీరంలో ఉత్పత్తి కాదు. దీనివల్ల వారి శరీరంలో రక్తంలో చక్కెర పరిమాణం బాగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెంతికూరను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు మెంతి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

మెంతి ఆకుల్లో  ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెంతి ఆకుల టీ ని తాగితే మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మెంతిఆకులను తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలగుతుంది. 
 

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

కొన్ని అధ్యయనాల ప్రకారం.. మెంతి ఆకులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్డిఎల్) పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్) ను తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతి ఆకులు కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. కాలేయంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తాయి.

పురుషులలో టెస్టోస్టెరాన్ ను పెంచడానికి సహాయపడుతుంది

మెంతి ఆకులు పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. మెంతి ఆకుల్లో ఫ్యూరోస్టానోలిక్ సాపోనిన్లు ఉంటాయి. ఇది టెస్టోస్టెరాన్ ను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మెంతులు లైంగిక వాంఛను పెంచుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
 

గుండె రోగులకు మేలు చేస్తుంది

మెంతులు, మెంతి ఆకులు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఇది హృద్రోగులకు చాలా అవసరం. మెంతి ఆకులు మూలికలుగా కూడా పనిచేస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ సంభవించినప్పుడు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

మెంతికూర కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకుంటే మెంతి ఆకులను మీ ఆహారంలో చేర్చుకోండి. ఒక కప్పు మెంతి ఆకుల్లో 13 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని కొద్ది మొత్తంలో తినడం ద్వారా మీ కడుపు బాగా నిండినట్టుగా అనిపిస్తుంది. దీని తర్వాత మీకు త్వరగా ఆకలిగా అనిపించదు. దీంతో మీరు ఎక్కువగా తినలేరు. ఇలా సులువుగా బరువు తగ్గుతారు.

click me!