అరటి తొక్కను జుట్టుకు రుద్దితే ఏమవుతుందో తెలుసా?

First Published | Apr 28, 2024, 11:34 AM IST

రోజూ అరటి  పండు తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ అరటి పండును తినేసి దాని  తొక్కను పారేస్తుంటారు. కానీ అరటి తొక్కను ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. 
 

banana peels

జుట్టును బలోపేతం చేయడానికి మనం ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. కానీ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. అందుకే జుట్టుకు ఎప్పుడూ కూడా నేచురల్ వస్తువులను మాత్రమే అప్లై చేయాలి. నిజానికి నేచురల్ వస్తువులు జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, షైనీగా మెరవడానికి అరటి తొక్క చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. జుట్టుకు అరటి తొక్కలను రుద్దితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అరటి తొక్క ప్రయోజనాలు 

జుట్టుకు అరటి తొక్కను పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అరటి తొక్కలు జుట్టును పొడుగ్గా పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అరటి తొక్కలను వాడటం వల్ల జుట్టు మూలాలు బలంగా మారుతాయి. అలాగే జుట్టు  ఆరోగ్యంగా పెరుగుతుంది. 
 

Latest Videos


ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు 

అరటి తొక్కలను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి కెమికల్స్ లా చెడు ప్రభావాలను అసలే చూపవు.  అరటి తొక్కతో తయారుచేసిన ప్యాక్ జుట్టుకు వేసుకోవడం వల్ల జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. 

జుట్టు మృదువుగా మారుతుంది. 

అరటి తొక్కలను జుట్టుకు రుద్దడం వల్ల జుట్టు సహజ మెరుపు అలాగే ఉంటుంది. అలాగే జుట్టు ఇంకా షైనీగా మెరుగుస్తుంది. అలాగే జుట్టు మృదువుగా మారుతుంది. మీ జుట్టు అందంగా, షౌనీగా కనిపించాలంటే మాత్రం మీరు అరటి తొక్కలను జుట్టుకు ఉపయోగించొచ్చు. 

జుట్టు బలోపేతం 

అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా మార్చడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే మీరు దీన్ని హెయిర్ మాస్క్ గా కూడా ఉపయోగించొచ్చు.

click me!