Benefits of Crying: ఏడుపు కూడా మంచిదేనట.. ఎందుకో తెలుసా?

First Published Jan 14, 2022, 6:03 PM IST

Benefits of Crying: ఉరుకుల పరుగుల జీవితంలో మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా సమయం దొరకని వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక నవ్వడం, ఏడ్వడం అంటే ఏంటో పూర్తిగా మర్చిపోయి ఒక మెషిన్ లా బతుకుతున్న వాళ్లు లేకపోలేదు. మనిషిని ఒత్తిడి నుంచి దూరం చేయడంలో నవ్వు, ఏడుపు అత్యంత ముఖ్యమైనవి. అందులో ఏడుపు ఒక వరంలాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే..

నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వక పోవడం ఒక రోగం అన్న సామేత మనకు ఎంతో అవసరం. ఎందుకంటే నేటి ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంతో నవ్వడం పూర్తిగా మర్చిపోయి బతుకుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడితో ( Stress) ఉన్న వాతావరణంలో బతుకుతున్నారు. అలాంటి వారికి నవ్వు అత్యంత అవసరం. ఒక చిన్ని నవ్వుతో ఒత్తిడిని సునాయాసంగా దూరం చేయొచ్చు. అందుకే లాఫర్ యోగా చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నవ్వడం మూలంగా ముఖ కండరాలకు కూడా కదిలి. రక్త సరఫరా పెరిగి ముఖం నిగారిస్తుంది. 

నవ్వితే  Brain షార్ప్ గా అవుతుంది. ఈ సంగతి పక్కన పెడితే.. నవ్వితే ఎంత అందంగా ఉన్నావు.. ఇలాగే నవ్వుతూ బతుకు అంటూ దీవిస్తుంటారు పెద్దలు. ఇక అదే ఏడిస్తే ఏమంటారు..? ఏడుపుగొట్టు మొహంది.. ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటది. ఎప్పుడు ఏమైందని ఏడుస్తున్నావని నానా మాటలు అని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉతికి ఆరేస్తుంటారు మాటలతో. ఇంకా కొందరైతే ఏడిపు మంచిది కాదు.. అశుభం అని భావిస్తుంటారు. కానీ ఏడుపు వల్ల జరిగే నష్టాలు, అశుభాలు ఏవీ లేవండి. ఏడిస్తే అంతా మంచే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదేం విడ్డూరం అని షాక్ అవ్వకండి. ఎందుకంటే ఇది నూటికి నూరు పాళ్లు నిజం కాబట్టి. 

ఏడిస్తే మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండ్రాఫిన్, ఆక్సిటోసిన్ అనే రసాయనాలు మనం ఎక్కువ సేపు ఏడవడం వల్ల  Release అవుతాయి. ఇవి ఫీల్ గుడ్ రసాయనం. దీనివల్ల Psychological emotions సంబంధించి అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే శరీరక మార్పులు కూడా జరుగుతాయి. అంటే శరీరానికి ఎటువంటి నొప్పినైనా తట్టుకునే శక్తి వస్తుందన్న మాట. ముఖ్యంగా ఎక్కువ సేపు ఏడిస్తే మెదడు ఉష్ణోగ్రత తగ్గి.. అది చాకచక్యంగా.. సమన్వయంతో ఆలోచించే విధంగా తయారవుతుంది. 

మనం ఏడిస్తే కంట్లో నుంచి నీరు కారుతుంది. అలా కారడం వల్ల కంట్లో ఉన్నా దుమ్ము, దూళీ, మలినాలు కూడా బయటకు పంపబడతాయి. అలాగే బ్యాక్టీరియాల నుంచి కంటికి రక్షణ కల్పించడంలో కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్ క్రిములు ముందుంటాయి. ఏడిస్తే అప్పుడప్పుడు బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. తద్వార హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతాం. 
 

ఏడవడం వల్ల  Negative Thinking కూడా దూరం అవుతుంది. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే పాజిటీవ్ గా ఆలోచించగలుగుతారు.  ఏడిస్తే మనలో ఉన్న బాధ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే కన్నీళ్లు కళ్లకు మంచి వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

డిప్రెషన్ ను దూరం చేయడంలో ఏడుపుకు మించిన మంచి ఔషదం లేదు. ఏడిస్తే మనసులో గూడు కట్టుకున్న ఎమోషనల్, ఫిజికల్ బాధలకు చెక్ పెట్టొచ్చు.  నవ్వడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ఏడవడం వల్ల కూడా అంతకు మించి ప్రయోజనాలున్నాయి. అందుకే బాధగా అనిపించినప్పుడు కన్నీళ్లకు స్వేచ్ఛనివ్వండి. బాధల నుంచి ఉపశమనం పొందండి. 
 

click me!