తమిళ చిత్రాలతో కెరీర్ ని ప్రారంభించిన ఆమని `జంబ లకిడి పంబ` మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత `మిస్టర్ పెళ్లాం`లో హీరోగా నటించి ఆకట్టుకుంది. నంది అవార్డుని అందుకుంది. `కన్నయ్య కిట్టయ్య`, `శుభ లగ్నం`, `హలో బ్రదర్`, `అమ్మదొంగ`, `ఘరానా బుల్లోడు`, `శుభ సంకల్పం`, `వంశానికొక్కడు`, `మావిచిగురు`, `ఆ నలుగురు`, `దేవస్థానం`, `చందమామ కథలు` వటి చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడు కూడా అడపాదడపా చిత్రాలతో మెప్పిస్తుంది. సీరియల్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది.