కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగొద్దో తెలుసా?

First Published | Apr 27, 2024, 1:23 PM IST

సాధారణంగా కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి మన దాహాన్ని తీర్చడమే కాకుండా.. మనల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. కానీ కొన్ని సమయాల్లో కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు.
 

చాలా మందికి కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగే అలవాటు ఉంటుంది. ఇక కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. ఈ అలవాటు మీ శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అందరికీ కొబ్బరి నీళ్లు ప్రయోజనకరంగా ఉండవు తెలుసా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. అసలు ఎవరు కొబ్బరి నీళ్లను తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మూత్రపిండాల వ్యాధి

ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులను అస్సలు లైట్ తీసుకోకూడదు. మీకు ఎలాంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నా కొబ్బరి నీళ్లను పొరపాటున కూడా తాగకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యలను బాగా పెంచుతుంది. 
 

Latest Videos


కొబ్బరి నీళ్లు ఎందుకు తాగకూడదు?

కొబ్బరి నీళ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. పొటాషియాన్ని ఎక్కువగా తీసుకుంటే దీన్ని మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేవు. ఇలాంటి పరిస్థితిలో..  ఈ కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం మూత్రపిండాలలో పేరుకుపోతుంది. అలాగే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. 
 

అధిక రక్తంలో చక్కెర 

డయాబెటీస్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ వాటర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 
 

అలెర్జీలు ఉంటే

అలెర్జీ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు కూడా వీటిలో ఒకటి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అలెర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది చర్మంపై దురద, చికాకును కలిగిస్తుంది. అలాగే చర్మం అయ్యేలా చేస్తుంది. 
 

ఈ సమస్యలున్నవారు..

కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత చాలా మందికి శరీరంలో వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తుంటాయి. మీకు కూడా కొబ్బరి నీళ్లను తాగిన వెంటనే ఇలా అయితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. అలాగే కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. 
 

అధిక రక్తపోటు 

అధిక రక్తపోటు సమస్యున్నవారు ఏవి పడితే అవి తాగకూడదు. తినకూడదు. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయకపోతే శరీరానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

జలుబు

కొబ్బరి నీళ్లకు చలువ చేసే గుణం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీకు ఇప్పటికే మీకు జలుబు సమస్య ఉన్నట్టైతే కొబ్బరి నీళ్లను తాగకండి. అలాగే తాగితే మీ జలుబు సమస్య మరింత పెరుగుతుంది. 
 

click me!