ఇక పాదాలకు చెమట ఎక్కువగా పట్టే వారు కాటన్ సాక్స్ మాత్రమే ధరించాలి. మీరు మందపాటి సాక్స్ వేసుకుంటే, మీరు ఓవర్ హీట్ అవుతారు .చెమట కారణంగా మీ సాక్సులు మాత్రమే కాదు.. మీ పాదాలు కూడా దుర్వాసన రావడం ప్రారంభమవుతాయి. సాక్సులు వేసుకునే రంగుని బట్టి కూడా ఉంటుంది. ఎండాకాలం నలుపు నంగు సాక్సులు ధరించకూడదు. తెలుపు రంగు సాక్సులు మాత్రమే ధరించాలి అనే విషయం గుర్తుంచుకోండి. నలుపు రంగు సాక్సులు ధరించడం వల్ల సూర్య రశ్మి ఎక్కువగా తగిలి మరింత చెమట ఎక్కువగా వస్తుంది.