బీట్ రూట్ తో ముఖంపై ముడతలు మాయం..! ఎలా ఉపయోగించాలంటే?

First Published | Jul 29, 2023, 3:41 PM IST

బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్ రూట్ స్కిన్ కలర్ ను మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. ఇది మొటిమల మచ్చలు, ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. బీట్ రూట్ ను ఉపయోగించి ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు, ఇతర వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకోవచ్చు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. 

Beetroot

బీట్ రూట్ చర్మం సహజ మెరుపును పునరుద్ధరించడానికి, డల్ స్కిన్ టోన్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగొచ్చు. బీట్ రూట్ చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మొటిమల వల్ల కలిగే మచ్చలు, ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి కూడా బీట్ రూట్ సహాయపడుతుంది.



బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై అదనపు నూనెను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మొటిమలు, డ్రైనెస్ ను నివారిస్తుంది. బీట్ రూట్ లో బీటాలైన్స్ అనే వర్ణద్రవ్యాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే బీట్ రూట్ మొటిమల దురద, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

beetroot

బీట్ రూట్ లోని విటమిన్ సి మెలనిన్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ముదురు, రంగు మారిన పెదవులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్ రూట్ లోని విటమిన్ సి వృద్ధాప్యపు తొలి సంకేతాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముఖ అందం కోసం బీట్ రూట్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

beetroot

1. రెండు టేబుల్ స్పూన్ల బీట్ రూట్ జ్యూస్ ను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసి బాగా కలపాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమలను తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. 

Image: Getty

2. బీట్ రూట్ ను ఉడికించిన తర్వాత చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. బీట్ రూట్ లో ఐరన్, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి.

Latest Videos

click me!