ధ్యానం అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. ఆందోళన కలిగించే ఆలోచనలను దూరం చేస్తుంది. ప్రతికూలతను తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.
సమస్య గురించి ఎక్కువగా ఆలోచించకుండా దానికి పరిష్కారం ఎలా కనుక్కోవాలనే దానిపై దృష్టి పెట్టండి. సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఇది సాధ్యం.
ఒంటరిగా ఉండటం వల్ల అతిగా ఆలోచించే అలవాటు పెరుగుతుంది. కాబట్టి స్నేహితులతో ఆడుకోండి. కుటుంబంతో బయటకు వెళ్ళండి. దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు.
అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే సమయం వృధా అవుతుంది. మీ మనసు కూడా బాధపడుతుంది. కాబట్టి వాటిని దూరం చేసుకోవడం మంచిది.
మానసిక ఒత్తిడి, నిరాశ, మానసిక క్షోభ, తలనొప్పి, జీర్ణ సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి.