ప్రతిసారి వాడిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ శుభ్రం చేయాలి. లేకపోతే మరకలు పేరుకుపోయి శుభ్రం చేయడం కష్టం అవుతుంది.
ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ ఎలా పడితే అలా శుభ్రం చేయకూడదు. శుభ్రం చేసే ముందు బుక్ లెట్ లోని సూచనలు చదవండి.
ఎయిర్ ఫ్రైయర్ లో బాస్కెట్, పాన్, డివైడర్ లాంటివి ఉంటాయి. వాటిని సెపరేట్ చేసి శుభ్రం చేస్తే సులువుగా అయిపోతుంది.
బాస్కెట్ ని వేడి సబ్బు నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. దీని వల్ల మరకలు తొలగిపోతాయి.
స్పాంజితో మరకలు లేకుండా శుభ్రం చేయండి. తర్వాత నీటితో కడిగి ఆరబెట్టండి.
వేడి వచ్చే చోట మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని తడిగుడ్డతో తుడవండి.
దుర్వాసన పోవడానికి బాస్కెట్ ని వేడి సబ్బు నీటిలో నానబెట్టండి.
అరటి తొక్కలతో జుట్టు పెరుగుతుందా?
పుదీనాతో మొటిమలను కూడా తగ్గించుకోవచ్చు. ఎలాగంటే?
ఆలివ్ ఆయిల్ ముఖానికి రాస్తే ఏమౌతుంది?
డ్రెస్‌పై పడిన మామిడి మరకలు తొలగించే సింపుల్ టిప్స్ ఇవిగో