ఇంట్లో రోజువారీ మనం వాడే వస్తువులతో అందానికి మెరుగులు దిద్దకోవచ్చని మీకు తెలుసా? అయితే ఇది చూడండి..
ఖాళీ స్ప్రే బాటిల్ లో హౌజ్ హోల్డ్ స్టార్చ్ వేయడం వల్ల డ్రై షాంపూను తయారుచేసుకోవచ్చు.
కొద్ది మొత్తంలో ఆలివ్ ఆయిల్ ను ముఖానికి రాసుకోవడంవల్ల.. అది చర్మరంద్రాల్లోని మురికిని, దుమ్మును తొలగించే అయస్కాంతంలాగా పనిచేస్తుంది. దీంతో మీ చర్మం శుభ్రంగా, కాంతివంతంగా తయారవుతుంది.
కాఫీ ఫిల్టర్స్ ను బ్లోటింగ్ పేపర్లుగా వాడొచ్చు. కాఫీ ఫిల్టర్లు తయారయ్యే మెటీరియల్ బ్లోటింగ్ పేపర్ లాంటి మెటీరియల్ తోనే తయారవ్వడం వల్ల పెద్ద తేడా ఉండదు.
కొన్ని చెంచాల ఓట్స్ ను ఉడికించి వాటితో స్ట్రాబెరీ గుజ్జు, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని మీ చేతులకు మొత్తం పూయండి. రెండు నిమిషాల తరువాత కడిగేయండి. దీనివల్ల చేతులు కాంతివంతంగా తయారవుతాయి.
ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో పెట్రోలియం జెల్లీని రాసి వేడి టవల్ తో కాపడంలాగా పెట్టండి. తరువాత వెట్ టిష్యూతో తుడిచేయండి.
పొడి జుట్టుకు : రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక మీడియం సైజు అవకడో లను బాగా కలిపి.. దీన్ని పొడి జుట్టుకు రాయండి. 20 నిమిషాల తరువాత కడిగేయండి. దీనివల్ల అవకాడోలోని అన్ సాచురేటెడ్ ఆయిల్స్ తో మీ జుట్టు మాయిశ్చరైజ్ అవుతుంది.
దురదలకు.. : ఓట్స్ లో ఉండే ల్యూబ్రికేటింగ్ ఫ్యాట్, చక్కెరలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. అందుకే మొహంమీద దురద, మంట, ఎరుపు తగ్గడానికి ఓట్ మీల్ మాస్క్ వేసుకోండి.
స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే కాఫీ బెస్ట్ రెమెడీ.. గ్రౌండ్ కాఫీ, ఆలివ్ ఆయిల్ ను బాగా కలిపి స్క్రబ్ తయారు చేయండి. దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేయండి. ఫలితం మీరే చూడండి.
కళ్ళ ఉబ్బును తగ్గించడానికి గ్రీన్ టీ బ్యాగ్ లు బాగా పనిచేస్తాయి. చల్లటి గ్రీన్ టీ బ్యాగ్ ను ఉబ్బిన కళ్ల మీద 5 నిమిషాల పాటు పెట్టుకుంటే సరి.
కళ్ళ ఉబ్బును తగ్గించడానికి గ్రీన్ టీ బ్యాగ్ లు బాగా పనిచేస్తాయి. చల్లటి గ్రీన్ టీ బ్యాగ్ ను ఉబ్బిన కళ్ల మీద 5 నిమిషాల పాటు పెట్టుకుంటే సరి.