బాదంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల చాలా లాభాలున్నాయి.
బాదం ఎన్ని గంటలు నానబెట్టాలో చాలా మందికి సందేహం ఉంటుంది. 8 నుండి 12 గంటల వరకు నానబెట్టిన తర్వాత తినవచ్చు.
బాదంలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బరువు తగ్గేవారు వాల్ నట్స్ కంటే బాదం పప్పు తినడం మంచిది. బేకరీ, పిండివంటలు మానేసి బాదం తినండి.
నీళ్ళలో నానబెట్టిన బాదంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
బాదం తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుందని న్యూట్రీషన్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలియజేస్తుంది.
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బాదం తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
బాదంలో ఉండే మెగ్నీషియం మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.