పచ్చి ఉల్లిపాయల్లో నీళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ముఖ్యంగా వేసవిలో వడదెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుంది.
వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడానికి పచ్చి ఉల్లిపాయలు తినొచ్చు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
వేసవి వేడి వల్ల వడదెబ్బ తగులుతుంది. దీన్ని నివారించడానికి ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలు తినడం చాలా మంచిది.
ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలు తింటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది దురద, మొటిమలు, జుట్టు రాలడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పచ్చి ఉల్లిపాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజూ తింటే బరువు తగ్గుతారు.
ఉల్లిపాయలు తింటే నోటి దుర్వాసన వస్తుంది. ఎక్కువగా తింటే గుండె సంబంధిత సమస్యలు రావొచ్చు. తినే ముందు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.