ఈ ఏడాది వేసవికాలం ప్రారంభం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల దెబ్బకు ఇళ్లపై ఉన్న ట్యాంకుల్లోని వాటర్ మంటపెట్టి వేడిచేసినట్లు అవుతున్నాయి. బయటకు వెళ్లి వచ్చి మొహాన్ని కాస్త చల్లటి నీళ్లతో కడుక్కోవాలంటే కుదరని పరిస్థితి. మరి ఎండకాలంలో ట్యాంకుల్లోని వాటర్ చల్లగా ఉంచుకోవడానికి ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే. ఓసారి ట్రై చేయండి.
గోనె సంచి
ఎండల వేడికి నీరు వేడెక్కకుండా.. తడిసిన గోనె సంచి లేదా మందపాటి బట్టను ట్యాంక్ మీద వేయొచ్చు. ఇది నీటిని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. బాగా ఎండగా ఉన్నప్పుడు గోనెసంచిని తడపాలి.
వైట్ కలర్
వైట్ లేదా లేత రంగు సూర్యకాంతిని కాస్త తగ్గిస్తుంది. దీనివల్ల వేడి ప్రభావం తగ్గుతుంది. ట్యాంక్‌ను తెల్లటి గుడ్డతో కప్పవచ్చు లేదా అల్యూమినియం రేకు వాడవచ్చు. మీ వాటర్ ట్యాంక్ నలుపు లేదా ముదురు రంగులో ఉంటే, లేత రంగుకు మార్చండి. లేత రంగులు సూర్యకాంతిని తక్కువగా గ్రహిస్తాయి.
ట్యాంకు చుట్టూ మట్టి
ట్యాంక్‌ను తెరిచిన ప్రదేశంలో ఉంచితే, దాని చుట్టూ గడ్డి లేదా తడి మట్టిని వేయండి. ఇది వేడిని తగ్గించి, నీరు చల్లగా ఉండటానికి సహాయపడుతుంది.
నీడలో..
వీలైతే, ట్యాంక్‌ను ఎండపడని ప్రదేశంలో ఉంచడానికి ట్రై చేయండి. నీడలో ఉంటే వాటర్ వేడికావడానికి అవకాశం ఉండదు. లేదా ట్యాంకుపై రేకుల షెడ్డును నిర్మించవచ్చు. దీనివల్ల నీళ్లు కూల్‌గా ఉంటాయి.