IPL 2025: టాప్ 5 అన్‌క్యాప్డ్ ప్లేయర్స్.. వీరి ఆటను చూడాల్సిందే !

Top 5 Uncapped Players in IPL 2025 : క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 (IPL 2025) లో సత్తా చాటుతామంటున్నారు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు.

IPL 2025 Top 5 Uncapped Players to Watch in telugu rma
IPL 2025 Top 5 Uncapped Players to Watch

Top 5 Uncapped Players in IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) రాబోయే ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.  ఐపీఎల్ ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు మంచి భవిష్యత్తును అంధించింది. అలాగే, ప్రపంచ క్రికెట్‌కు, మరీ ముఖ్యంగా భారత క్రికెట్‌కు ఎంతో మంది సూపర్ స్టర్ ప్లేయర్లను అందించింది. 

ఒకప్పుడు క్లబ్‌లు, రాష్ట్రాల కోసం ఆడిన ఆటగాళ్లు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన ఆటతో నేడు భారత జట్టులో చోటుసంపాధించిన వారు ఉన్నారు. 2025లో కూడా పలువురు యంగ్ ప్లేయర్లు ఐపీఎల్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొడతామంటూ సంకేతాలు పంపుతున్నారు. అలాంటి టాప్ 5 ప్లేయర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

IPL 2025 Top 5 Uncapped Players to Watch in telugu rma
IPL 2025 Top 5 Uncapped Players to Watch

రాబిన్ మిన్స్ (Mumbai Indians)

రాబిన్ మిన్స్ గత సంవత్సరం గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో ఒప్పందం కుదుర్చుకుని ఐపీఎల్ (IPL) ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అయితే, ఒక ఘోర రోడ్డు ప్రమాదం అతని కలలను చెదరగొట్టింది. ఆ గాయం నుంచి కోలుకున్న అతని ఐపీఎల్ మెగా వేలంలో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రూ. 65 లక్షలకు దక్కించుకుంది. తనకు ప్లేయింగ్ 11లో చోటుదక్కితే మంచి ఇన్నింగ్స్ లను ఆడతానని చెబుతున్నాడు. 

విస్డన్ ప్రకారం ఇది అతని బేస్ ధర రూ.30 లక్షల కంటే రెండు రెట్లు ఎక్కువ. మిన్స్ జార్ఖండ్ విధ్వంసకర ఆటగాడు, టి20 క్రికెట్‌లో 181 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో 67 పరుగులు చేశాడు. 22 ఏళ్ల ఈ ప్లేయర్ వికెట్ కీపర్ కూడా కావడం గమనార్హం.


IPL 2025 Top 5 Uncapped Players to Watch

సూర్యాన్ష్ షెడ్జ్ (Punjab Kings)

సూర్యాన్ష్ షెడ్జ్ 2024 సంవత్సరంలో అత్యుత్తమ దేశవాళీ ప్లేయర్లలో ఒకరిగా సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ కప్ 2024 ఫైనల్‌లో ముంబైకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. మధ్యప్రదేశ్‌పై 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు అతని జట్టు 129/5 వద్ద ఉన్నప్పుడు, షెడ్జ్ 15 బంతుల్లో 36* పరుగులతో ముంబైని విజయం వైపు నడిపించాడు.  తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. బౌలింగ్ లో వెంకటేష్ అయ్యర్ వికెట్‌ను కూడా తీసుకున్నాడు.

షెడ్జ్ 9 ఇన్నింగ్స్‌లలో 43.66 సగటు, 251.92 స్ట్రైక్ రేట్ తో 131 పరుగులు చేశాడు. 36* పరుగుల టాప్ స్కోర్ తో సిరీస్ ను ముగించాడు. విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీలో పలు మంచి ఇన్నింగ్స్ లను ఆడిన తర్వాత తనకు గుర్తింపు లభించింది. ఐపీఎల్ లో అతను రాణిస్తే భారత జట్టులో చోటు సంపాదించే అవకాశం కూడా ఉంది. రాబోయే ఐపీఎల్ 2025 ఎడిషన్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టులో ఆడనున్నాడు. ఈ టీమ్ అతన్ని రూ.30 లక్షల బేస్ ధరతో దక్కించుకుంది.

IPL 2025 Top 5 Uncapped Players to Watch

వైభవ్ సూర్యవంశీ (Rajasthan Royals)

గత సంవత్సరం ఐపీఎల్ (IPL) మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ టీమ్ రూ. 1.1 కోట్లకు దక్కించుకుంది.  మార్చి 27, 2011న బీహార్‌లో జన్మించిన వైభవ్ ఐపీఎల్ 2025 (IPL 2025) క్రికెట్‌లో పాల్గొనే అతి చిన్న వయస్కుడైన క్రికెట్ గా కొనసాగుతున్నాడు. జనవరి 2024లో బీహార్ జట్టు తరపున తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 సంవత్సరాల 284 రోజులలో అరంగేట్రం చేశాడు. గత సంవత్సరం, అతను చెన్నైలో ఆస్ట్రేలియాపై జరిగిన ఇండియా అండర్-19 మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి 58 బంతుల్లో సెంచరీ కొట్టాడు. 

వైభవ్ SMAAT 2024 టోర్నమెంట్‌లో బీహార్ జట్టు తరపున తన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు, అయితే అతను తన ఏకైక మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ACC అండర్ 19 ఆసియా కప్ 2024-25లో ఏడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఇతనే. అతను టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌లలో 176 పరుగులు చేశాడు, అత్యధికంగా 76* పరుగులు చేశాడు.

IPL 2025 Top 5 Uncapped Players to Watch

సి ఆండ్రీ సిద్ధార్థ్ (Chennai Super Kings)

తమిళనాడు జట్టు ఆటగాడు ఎస్ శరత్ అల్లుడైన 18 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో (టీఎన్‌పీఎల్) ఆడాడు, కానీ ఇంకా అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఆడలేదు. అయితే, ఆండ్రీ రంజీ ట్రోఫీ సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. తమిళనాడు తరపున 12 ఇన్నింగ్స్‌లలో 68.00 సగటుతో 612 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. రాబోయే ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్న సిద్ధార్థ్ తనదైన ముద్ర వేస్తాడా? లేదా అనేది వేచి చూడాలి.

IPL 2025 Top 5 Uncapped Players to Watch

బెవోన్ జాకబ్స్ (Mumbai Indians)

ఈ జాబితాలో ఉన్న బెవోన్ జాకబ్స్ ఒక్కడు మాత్రమే విదేశీ యంగ్ ప్లేయర్. ప్రిటోరియాలో జన్మించిన జాకబ్స్ న్యూజిలాండ్ దేశీయ జట్లైన ఆక్లాండ్, కాంటర్‌బరీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముంబై జట్టు అతన్ని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.  మొత్తంగా 20 టీ20 మ్యాచ్‌లలో, అతను 17 ఇన్నింగ్స్‌లలో 423 పరుగులు చేశాడు.  32.53 సగటు, 148 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 2 అర్ధ సెంచరీలు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 90 పరుగులు (నాటౌట్). 

Latest Videos

click me!