Air India Flight ఇదేం చోద్యం మావా..! టాయిలెట్లు జామ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండ్!

Published : Mar 13, 2025, 10:06 AM IST
Air India Flight ఇదేం చోద్యం మావా..! టాయిలెట్లు జామ్..  విమానం ఎమర్జెన్సీ ల్యాండ్!

సారాంశం

సాంకేతిక లోపం తలెత్తిందనీ, వాతావరణం అనుకూలించలేదనీ.. విమానాలు అత్యవసర ల్యాండింగ్ అవడం మనం చూశాం. కానీ టాయిలెట్లు పాడైపోయి ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన ఓ చిత్రమైన సంఘటన జరిగింది. 

చికాగో నుండి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI126 ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.  విమానం బయలుదేరిన తర్వాత, విమానంలో ఉన్న 12 టాయిలెట్లలో 8 జామ్ అయ్యాయని విమాన సిబ్బంది గుర్తించారు. దాదాపు రెండు గంటల తర్వాత.. బిజినెస్, ఎకానమీ సెక్షన్లలో కొన్ని టాయిలెట్లలో సమస్య వచ్చిందని సిబ్బంది చెప్పారు. టాయిలెట్లలో కొన్ని బట్టలు, ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులు వేయడం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయని విచారణలో తేలింది. ఈ సమస్యల వల్ల బిజినెస్ క్లాస్‌లో ఒక టాయిలెట్ మాత్రమే పనిచేసింది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం విమానాన్ని చికాగోకు వెనక్కి తిప్పాలని నిర్ణయించారు. "సౌకర్యం లేక ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు మేము సారీ చెబుతున్నాం. ఫ్లైట్ డైవర్ట్ అవ్వడం వల్ల వారి ప్రయాణ ప్రణాళికలు మారాయి" అని ఎయిర్‌లైన్ తెలిపింది.

యూరప్‌లోని కొన్ని నగరాల మీదుగా వెళ్తున్న విమానాన్ని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెనక్కి పంపాలని ఎయిర్‌లైన్ నిర్ణయించింది. యూరోపియన్ విమానాశ్రయాల్లో రాత్రిపూట కార్యకలాపాలపై నిషేధం ఉండటంతో, విమానాన్ని యూరప్‌కు బదులుగా చికాగోకు మళ్లించారు. చికాగోలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం హోటల్‌లో బస ఏర్పాటు చేసింది. ఢిల్లీకి మళ్లీ ప్రయాణం చేయడానికి కొత్త విమానాన్ని ఏర్పాటు చేసింది.  

PREV
click me!

Recommended Stories

Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
అదిరిపోయే డిజైన్లలో హూప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి