రూ.4 కోట్ల అప్పు వల్ల రోడ్డున పడ్డ ప్రముఖ నటి, అసలేం జరిగింది ?
బుల్లితెర సీరియల్స్‌లో ఫేమస్ అయిన నీలిమా రాణి తన లైఫ్‌లో తను ఫేస్ చేసిన కష్టాల గురించి మనసు విప్పి మాట్లాడింది.
బుల్లితెర సీరియల్స్‌లో ఫేమస్ అయిన నీలిమా రాణి తన లైఫ్‌లో తను ఫేస్ చేసిన కష్టాల గురించి మనసు విప్పి మాట్లాడింది.
నటి నీలిమా రాణి అసలు రూపం: అప్పు నుండి సక్సెస్ వరకు : నీలిమా రాణి, చిన్నతెర మరియు వెండితెరపై నటించి చాలా మంది మనస్సులను గెలుచుకున్నారు. బాలనటిగా పరిచయమైన ఆమె 90ల నుండి సీరియల్స్‌లో నటించారు. ముఖ్యంగా “వాణి రాణి” మరియు “తమరై” వంటి ప్రసిద్ధ సీరియల్స్‌లో నటించారు. తన జీవితంలో చాలా కష్టాలను దాటుకుని వచ్చిన నీలిమా, దాని ద్వారా పొందిన అనుభవాలను పంచుకున్నారు. ఆ అనుభవాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నాయి.
నీలిమాకు 21 ఏళ్లకే ఇసైవాణన్ అనే వ్యక్తితో పెళ్లయింది. పెళ్లయిన 6 నెలలకే ఆమె తండ్రి చనిపోయారట. తండ్రిని కోల్పోవడాన్ని నీలిమా జీర్ణించుకోలేకపోయారట. ఆ సమయంలో ఎక్కువగా గుళ్లకు వెళ్లడం, పుస్తకాలు చదవడం ద్వారా నెమ్మదిగా దాని నుంచి బయటపడ్డారట నీలిమా.
2017లో తన భర్తతో కలిసి 4 కోట్ల రూపాయల బడ్జెట్‌లో సినిమా తీయాలని డిసైడ్ అయ్యి, దానికోసం అప్పు చేసి సినిమా తీశారట. కానీ ఆ సినిమా అనుకున్నంతగా రాలేదట. దానితో ఆ సినిమాను చెత్తబుట్టలో పడేశామని, దానివల్ల వచ్చిన నష్టం తమను రోడ్డున పడేసిందని చెప్పారు. లైఫ్‌లో మళ్లీ పైకి రావాలని డిసైడ్ అయ్యి మళ్లీ చిన్నతెరలో నటించడం మొదలుపెట్టారు నీలిమా.
“వాణి రాణి”, “తమరై”, “తలయానై పూక్కల్” వంటి సీరియల్స్‌లో నటించినప్పటికీ అప్పుల బాధతో అద్దె ఇంట్లో కూడా ఉండలేక, స్నేహితుడి ఇంట్లో ఉన్నానని చెప్పారు నీలిమా. తమ టార్గెట్ గెలుపు వైపు ఉండటంతో ఓటమిని అంగీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అందుకే దాని నుంచి మళ్లీ వచ్చి ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నామని అన్నారు.
సినిమాలో నిర్మాతగా ఓడిపోయినా, ఒకరోజు నిర్మాతగా గెలవాలనే పట్టుదలతో 2017లో జీ తమిళ్‌లో ప్రసారమైన ఎన్నెండ్రుమ్ పున్నగై, నిరం మారద పూక్కల్ వంటి సీరియల్స్‌ను నిర్మించారు నీలిమా. సీరియల్ నిర్మించినా ఒకరోజు కచ్చితంగా సినిమా తీసి విజయం సాధిస్తామని నమ్మకంగా చెప్పారు నీలిమా. మనం నీరసించి కూర్చుంటే మనకు ఎవరూ సాయం చేయడానికి రారు... మనకు మనమే సాయం చేసుకోవాలి అని స్ఫూర్తినిచ్చే విధంగా నీలిమా మాట్లాడిన ఆ వీడియో వైరల్ అవుతోంది.