Tips to Stay Calm: విపరీతమైన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి

First Published Jan 25, 2022, 2:59 PM IST

Tips to Stay Calm: మనిషికి సంతోషం ఎలా అయితే వస్తుందో.. సమయ సందర్భాలను బట్టి కోపం కూడా కట్టలు తెంచుకుని వచ్చేస్తుంటుంది. సంతోషం వల్ల వచ్చే సమస్యలేమీ లేవు కానీ.. కోపం వల్ల చాలా అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మరి ఈ కోపాన్ని కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా నియంత్రించవచ్చు..


Tips to Stay Calm: మనిషన్నాకా కష్ట సుఖాలు రావడం చాలా సహజం. అలాగే సంతోషం, కోపం రావడం కూడా సర్వ సాధారణ విషయమే. ఎందుకంటే.. మనిషికున్న భావోద్వేగాలలో ఇవి కూడా భాగమే కాబట్టి. ప్రతి మనిషికి సంతోషం, ఆనందం అనే ఫీలింగ్స్ తో పాటుగా కోపం అనే ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ ఇది ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నా.. లిమిట్స్ దాటితేనే అసలుకే ఎసరులా తయారవుతుంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు రాకపోయినప్పటికీ.. ఎవరైనా ఇరిటేషన్ తెప్పిస్తోనో, కోపం తెప్పించే మాటలు అంటేనో అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండటం చాలా కామన్. 
 

 ఈ కోపం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు.. కానీ దీని మూలంగా వచ్చే నష్టం మాత్రం చాలానే ఉంటుంది. కొంతమంది కొన్ని విషయాలకు మాత్రమే కోపం అవుతుంటారు. మరికొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా కోపం అవడం మనం చూస్తున్నదే. కానీ కోపం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఎలాంటి కోపమైన మనిషికి నష్టం కలిగించేదే కానీ లాభం తెచ్చిపెట్టేది కాదు. ఈ కోపంలో విలువైన వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి.  కోపాన్నిఎలా కంట్రోల్  చేసుకోవాలో మాకు తెలియదు అనుకుంటే ఈ చిట్కాలను ఫాలో అయిపోండి. 

నీళ్లు ఆరోగ్యానికే కాదు కోపాన్ని కంట్రోల్ చేయడంలో కూడా బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబతున్నారు. ఎవరైనా మాటలు విన్నప్పుడు కోపంగా అనిపించినా.. కోపం వస్తున్నట్టు తెలిసినా వెంటనే ఒక గ్లాసు మంచి నీళ్లను తాగండి. ఇలా చేస్తే కోపం వచ్చే లక్షణాలను నీళ్లు తగ్గిస్తాయట.
 


కోపంగా అనిపించినప్పుుడు మీరు శ్వాస తీసుకునే విధానంపై దృష్టిని కేంద్రీకరించండి. అందులోనూ మీ పూర్తి ధ్యాసనంతా ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలపై పై పెట్టండి. ఇలా చేస్తే వెంటనే మీకోపం పటాపంచలై పోతుంది. 

కోపాన్ని కంట్రోల్ చేసే మరో మెరుగైన విధానం అంకెలను లెక్కపెట్టడం. అవును కోపంగా అనిపించినప్పుడు వెంటనే ఒకటి, రెండు అంటూ అంకెలను లెక్కపెట్టడం అలవాటు చేసుకోండి. వీలైతే వంద వరకు లెక్కపెట్టినా ఏమీ కాదు. తర్వాత వచ్చే ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.

తరచుగా ఒక వ్యక్తితో ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంటే.. తప్పు ఎక్కడుందో తెలుసుకోండి. మీరు వారిని మార్చాలనుంటే దానిని విరమించుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తిని మార్చడం మీ వల్ల కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎంత వారించినా, గొడవ పడినా ఏం ఫలితం లేనప్పుడు వారి విషయంలో మీరు జోక్యం చేసుకుని దండుగ అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు వారు మీతో వాధించినా మీకు కోపం రాదు.


మీ ఇంట్లో గొడవకు దారి పరిస్థితులు ఎదురైప్పుడు ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే అక్కడ ఉండకుండా మీకు నచ్చిన లేదా ఇష్టమైన పనులను చేసుకోవాలి. వంట, డ్యాన్స్ వంటి విషయాలపై ఫోకస్ పెడితే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. 

అనవసర విషయాలకు కూడా మీరు ఊరికే కోపం అవుతుంటే మాత్రం ఆలోచించాల్సిందే. దీని నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా మీరు ధ్యానం, లేదా యోగా మీద Concentrate చేయాలి.

ఇక నావల్ల కాదు ఈ కోపాన్ని కంట్రోల్ చేయడం అని అనిపించినప్పుడు ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోవడం చాలా ఉత్తమమైన పని. ఇకపోతే ప్రతిరోజూ ఇంట్లో గొడవ జరుగుతుంటే.. ఆ మాటలను మీరు వినకూడదు. వాటిని పట్టించుకోకూడదు. అవసరమైతే గొడవలకు దారి తీసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం చాలా ఉత్తమం.  
 

click me!