వాషింగ్ మెషిన్ల రాకతో బట్టలు ఉతికే పని ఆడవాళ్లకు తప్పింది. ఇది ఆడవాళ్ల పనులను చాలా వరకు తగిస్తుంది. వాషింగ్ మెషిన్ జస్ట్ నిమిషాల్లోనే బట్టను ఉతికేస్తుంది. కానీ వీటిలో అన్ని రకాల దుస్తులను ఉతకడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటి నాణ్యత, దుస్తుల రంగు దెబ్బతింటాయి.అందుకే వాషింగ్ మెషిన్ లో వేయకూడని దుస్తులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఏ దుస్తులు వాషింగ్ మెషిన్లో ఉతకకూడదు?
ఉన్ని దుస్తులు
వాషింగ్ మెషిన్లో ఉన్ని దుస్తులను అస్సలు వేయకూడదు. ఎందుకంటే ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి వీటిని వాషింగ్ మెషిన్ లో వేస్తే అవి తొందరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని ఎప్పుడైనా సరే చేతితోనే ఉతకాలి. తప్ప వాషింగ్ మెషిన్ లో వేయకూడదు.
ముత్యాలు పొదిగిన దుస్తులు:
ముత్యాలు, స్టన్స్ ఉన్న డిజైనర్, పార్టీవేర్ దుస్తులను వాషింగ్ మెషిన్ లో అస్సలు వేయమకూడదు. ఎందుకంటే వాషింగ్ లో వేస్తే స్టోన్స్, ముత్యాలు విరిగిపోతాయి. ఊడిపోతాయి. అలాగే వాషింగ్ మెషిన్ కూడా పాడవుతుంది.
నూనె లేదా ఆల్కహాల్ మరకలున్న దుస్తులు:
బట్టలపై మరకలు పడటం చాలా సహజం. అయితే పెట్రోల్, వంట నూనె, ఆల్కహాల్ వంటి మరకలు పడిన బట్టలను మాత్రం వాషింగ్ మెషిన్ లో ఉతకకూడదు. ఎందుకంటే దీనివల్ల వాషింగ్ మెషిన్ లో మంటలు వస్తాయి.
రెయిన్ కోట్
వాటర్ ప్రూఫ్ రెయిన్ కోట్ ను కూడా చాలా మంది వాషింగ్ మెషిన్ లో ఉతుకుతుంటారు. కానీ వీటిని వాషింగ్ మెషిన్ లో అస్సలు వేయకూడదు. ఎందుకంటే దీనివల్ల రెయిన్ కోట్ బెలూన్ లాగా ఉబ్బుతుంది. దీంతో అది చిరిగిపోతుంది. అంతేకాకుండా వాషింగ్ మెషిన్ కూడా పాడవుతుంది.
ఖరీదైన బ్రాలు
స్మూత్ గా, బాగా ఖరీదైన బ్రాలను కూడా వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. ముఖ్యంగా ప్యాడ్లు ఉన్న బ్రాలను వాషింగ్ మెషిన్ లో వేస్తే గనుక అవి చిరిగిపోయి పాడైపోతాయి.
జరీ దుస్తులు:
జరీ బట్టలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి వీటిని వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. ఎందుకంటే ఇవి పాడైపోతాయి. అందుకే వీటిని చేత్తోనే ఉతకాలి.