కరీంనగర్: పట్టణంలోని మార్కెట్ సమీపంలో గల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు. ఉదయం 4 గంటల నుండే మొదలైన వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
undefined
జగిత్యాల జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల్లో వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ ఏ. శరత్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి ,రాయికల్ పురపాలక సంఘాల వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిన వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ , కలెక్టరేట్ విభాగం పర్యవేక్షకుడు, కమిషన్లు పాల్గొన్నారు.
undefined
జగిత్యాల సమీపంలోని కోడీమ్యాల మండలం తిప్పాయ పల్లె గ్రామనికి చెందిన శ్రీను(35)అనే యువకుడు ఉపాధి నిమిత్తం ఖతర్ లో మృతి చెందాడు. తమకు ఫోన్ ద్వారా సమాచారం అందిందని... మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని శ్రీను కుటుంబ సభ్యలు తెలిపారు. శ్రీను మృతితో విషాద చాయలు నెలకొన్నాయి.
undefined
జగిత్యాల పట్టణములోని బీటు బజార్ కు చెందిన 26వ వార్డు నుండి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, అడితి ఖరీదు దారుల సంఘం అధ్యక్షులు చిక్కుల భూమన్న, కోటగిరి తుక్కయ్యతో పాటు 50 మంది నాయకులు స్ధానిక ఎమ్మెల్యే సంజయ్ కుమర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. యల్.యల్ గార్డెన్ లో జరిగిన ఈ సవేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గులాబీ కండువా కప్పివారిని పార్టీలోకి ఆహ్వానించారు.
undefined
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 12వ డివిజన్‌లో ఇంటి, ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చెప్పట్టారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
undefined
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్..పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నంతో పాటు ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
undefined
తన భర్త వివాహేతర సంబంధాన్ని ఓ మహిళ బయటపెట్టింది. 9 ఏళ్ల క్రితం స్వాతి అనే మహిళను అంజి వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల అతడు ఓ పరాయి స్త్రీ మోజులో పడి భార్యతో గొడవ పడడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన స్వాతి పుట్టింటివారి సాయంతో భర్త వేరే మహిళతో కలిసుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారిద్దరిని దేహశుద్ది చేసింది.
undefined
పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కటకం లోకేష్ తెలిపారు. స్థానిక 22వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం పై విపక్షాలు చేస్తున్న అర్ధరహిత ప్రచారంతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ విధ్వంసాలు సృష్టిస్తోందన్నారు. తమ రాజకీయ భవిష్యత్తును దేశ భద్రతపై ముడి పెడుతూ రాజకీయ పబ్బం ని గడుపుతున్న కాంగ్రెస్, ఎంఐఎం టిఆర్ఎస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు.
undefined