నిత్యం శృంగారంలో పాల్గొంటే జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

First Published Oct 9, 2021, 2:00 PM IST

భార్యభర్తల మధ్య శృంగారం అనేది చాలా అద్భుతమైన అందమైన అనుభూతి. శృంగారం మాటకు వస్తే ఆ పేరు వినగానే చాలామంది సిగ్గుపడుతుంటారు. 

భార్యభర్తల మధ్య శృంగారం అనేది చాలా అద్భుతమైన అందమైన అనుభూతి. శృంగారం మాటకు వస్తే ఆ పేరు వినగానే చాలామంది సిగ్గుపడుతుంటారు. కానీ శృంగారం అనేది భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతిరూపం.     
 

జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అదే విధంగా జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా నడపడానికి భార్యభర్తల మధ్య శృంగారం కీలక పాత్ర వహిస్తుంది. భార్య భర్తల మీద ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేస్తుంది.                                          
 

శృంగారం గురించి తెలుసుకునేటప్పుడు భార్య భర్తలకి ఎటువంటి సిగ్గు బిడియాలు ఉండకూడదు. శృంగారం అనేది భార్య భర్తల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు. శృంగారం భార్యాభర్తల మధ్య బంధాన్ని ప్రేమను బలపరుస్తుంది.                                                      
 

శృంగారం చేసేటప్పుడు మానవ శరీరంలో కొన్ని హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇది మెదడు పనితీరును, ఆలోచన శక్తిని, నాడి శక్తిని పెంచుతాయి. భార్య భర్తలు శృంగారంలో క్రమంగా పాల్గొనకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.                              
 

శృంగారంలో పాల్గొనటం వలన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్లు ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. శరీరంలో యాంటీబాడీలను పెంచుతుంది. శృంగార జీవితం ఆనందంగా సాగుతుంది.    
 

 వైద్యు నిపుణులు అధ్యయనం ప్రకారం కనీసం వారంలో రెండుసార్లు భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పాల్గొంటే 50 శాతం వరకు గుండెకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయని తేలింది. ఇక స్త్రీలు భావప్రాప్తికి ఎక్కువగా లోనవుతారట.
 

వారంలో ఐదుసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, స్త్రీలల్లో  బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయని తేలింది. అంతేకాకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి.
 

శృంగారంలో పాల్గొన్న తర్వాత అందులో ఆక్సిటోసిన్ విడుదలవడం వల్ల త్వరగా నిద్రలోకి జారుకుంటారు. ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ ఆక్సిటోసిన్ కొన్ని శరీర నొప్పులను కూడా నివారిస్తుందని అధ్యయనంలో తేలింది.
 

వారంలో రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే శరీరంలో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎ అనే యాంటీబాడీలు పెరుగుతాయట. యాంటీబాడీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం దంపతులిద్దరూ నిత్యం శృంగారంలో పాల్గొనడం చాలా మేలు అని వైద్య నిపుణులు అంటున్నారు.

click me!