పార్టీలో శోభన్‌బాబుని చూసి నవ్వుకున్న హీరోయిన్లు.. అయినా తగ్గని సోగ్గాడు.. ఫిట్‌ నెస్‌ రహస్యం

First Published May 2, 2024, 12:31 PM IST

శోభన్‌బాబు అందానికి మారుపేరు. సోగ్గాడిగా పాపులర్‌ అయిన ఆయన ఫిట్‌నెస్‌ సీక్రెట్ బయటపెట్టారు. అంతేకాదు హీరోయిన్లు తనని చూసి నవ్వుకున్న సందర్భం బయట పెట్టాడు. 

తెలుగు తెర సోగ్గాడిగా వెలిగాడు శోభన్‌ బాబు. ఆయన్ని మించిన అందగాడు లేడని అంతా అంటుంటారు. ఆడియెన్స్ మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఇదే మాట చెబుతారు. ఇక అప్పట్లో అమ్మాయిల డ్రీమ్‌ హీరో, హీరోయిన్ల హాట్‌ క్రష్‌ కూడా శోభన్‌ బాబు కావడం విశేషం.
 

ఏకంగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఆయన అందానికి, మంచి తనానికి పడిపోయిందంటే శోభన్‌బాబు గ్లామర్‌ లెక్కేంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన స్టార్‌ ఇమేజ్‌ వచ్చినా, వరుస సక్సెస్‌లు వచ్చినా ఫిట్‌నెస్‌ పరంగా చెక్కు చెదరలేదు. నటుడిగా ప్రారంభం నుంచి సినిమాలకు గుడ్‌ బై చెప్పేంత వరకు ఆయన వయసు రీత్యా వచ్చిన వెయిట్‌ తప్ప, అతిగా ఎప్పుడూ పెరగలేదు, ఆ అందం తగ్గలేదు. 
 

దానికి పెద్ద సీక్రెటే ఉంది. తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ని, ఆరవై ఏళ్లు అయినా ఇంకా యంగ్‌గా ఉండటానికి కారణం ఏంటో పెట్టాడు శోభన్‌బాబు. ఓ అరుదైన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అది యూట్యూట్‌లో ట్రెండ్‌ అవుతుంది. శోభన్‌ బాబు రిటైర్ట్ మెంట్‌కి దగ్గర్లో ఉన్న రోజుల్లో ఓ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. అదిప్పుడు ఈటీవీ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఉంది. 
 

ఇందులో ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడారు శోభన్‌బాబు. తాను బ్యాడ్‌ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటానని తెలిపారు. ఏదైనా మితంగా తింటాడట. రుచిగా ఉందని, నచ్చిందని అదే పనిగా తినను, తాగను అని తెలిపారు. కాఫీ తాగాలని ఉంటుందని, కానీ దాన్ని రోజూ రెండు పూటలు మాత్రమే తాగుతానని తెలిపారు. టీ బాగుందని గంగాలంలా కాకుండా పరిమితంగా తీసుకుంటే బాగుంటుందన్నారు. 
 

మరోవైపు యోగా తన ఫిట్‌నెస్‌కి చాలా ఉపయోగపడిందన్నారు. యోగా చేస్తుంటే ఆకాశంలో విహరిస్తున్నట్టు ఉంటుందన్నారు. అది మానసిక ప్రశాంతత ఇస్తుందని, మనసుని ఉల్లాసంగా మారుస్తుంది, మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందన్నారు. దాన్ని కనిపెట్టిన వారికి మొక్కాలంటూ ప్రశంసలు కురిపించారు. 

తాను స్మోక్‌ కూడా చేయను అని తెలిపారు. డ్రంక్‌ అస్సలు చేయనని తెలిపారు. అయితే పార్టీల్లో పాల్గొన్నప్పుడు హీరోయిన్లు నవ్వుకునే వారట. మిగిలిన హీరోలు, హీరోయిన్లు డ్రింక్స్ తీసుకుంటారు. ఆల్కహాల్‌ తీసుకుంటారు. హీరోయిన్‌ శాంపిల్స్(ఆల్కాహాల్‌ కంటెంట్‌ తక్కువగా ఉండే డ్రింక్‌) తీసుకుంటారు. తాను అవి కూడా తీసుకునే వాడిని కాదన్నాడు శోభన్‌ బాబు. ఓ పార్టీలో పాల్గొన్నప్పుడు తాను ఇలా ఏం తీసుకోకుండా ఉంటే వాళ్లు తెగ నవ్వుకున్నారట. 
 

`మేమే శాంపిల్స్ తీసుకుంటున్నాం, మీరు శాంపిల్స్ తీసుకోవడానికి భయపడుతున్నారు, ఇక బ్రాందీ వంటి హాట్‌ లిక్కర్స్ ఏం తీసుకుంటారని నవ్వుకునే వాళ్లు. అదే నా లైఫ్‌ అని చెప్పి తప్పించుకున్నాను` అని తెలిపారు శోభన్‌బాబు. అలా అన్నింటిని కంట్రోల్‌గా తీసుకుని, మనసుని కంట్రోల్‌ చేసుకుని ఉండేవాడిని అని, అదే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని తెలిపారు శోభన్‌ బాబు.

కృష్ణా జిల్లాలో జన్మించిన శోభన్‌బాబు.. 1959లో వెండితెరకి పరిచయం అయ్యారు. `భక్త శబరి` చిత్రంలో నటించారు. కానీ ఎన్టీఆర్‌ నటించిన `ధైవ బలం` చిత్రం మొదట విడుదలైంది. మొదట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణలతో కలిసి నటించారు. `బంగారు పంజరం`, `దేశమంటే మనషులోయ్‌`, `లవకుశ`, `వీరాభిమాణ్యు`, `మనుషులు మారాలి`, `కళ్యాణ మండపం`, `చెల్లెలి కాపురం`, `సంపూర్ణ రామాయణం`, `శారద`, `మంచి మనుషులు`, `జీవన జ్యోతి`, `సోగ్గాడు`, `కురుక్షేత్రం`, `మల్లేపూవు`, `గోరింటాకు`, `కార్తీక దీపం`, `దేవత`, `ముందడుగు`, `అందరు దొంగలే`, `చక్రవాకం`, `బలిపీఠం`, `స్వయంవరం`, `బలరామ కృష్ణులు`, `అశ్వమేథం`, `ఏవండి ఆవిడ వచ్చింది` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 

శోభన్‌ బాబు చివరగా 1996లో `హలో గురు` చిత్రంలో నటించారు. ఇది పెద్దగా ఆడలేదు. ఆతర్వాత ఆయన సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. 2008 మార్చి 20న మార్నింగ్‌ యోగా పూర్తి చేసుకున్నాక తన చైర్‌పై కూర్చొని టీఫిన్‌ కోసం వెయిట్‌ చేస్తుండగా హార్ట్ ఎటాక్‌ వచ్చింది. అంతలోనే పడిపోయాడు. ఆసుపత్రి తరలించేలోపే ఆయన కన్నుమూశారు. 

click me!