ఆటో డ్రైవర్ అని అవమానించారు, కారులో కూర్చొని ఏడ్చాను... పబ్లిక్ లో ధనుష్ కి అంత అవమానం జరిగిందా!

First Published May 2, 2024, 12:11 PM IST

కోలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నాడు ధనుష్. తన రూపం విషయంలో ధనుష్ తీవ్ర విమర్శలు ఎదుర్కోగా... ఓ సందర్భంలో ఆటో డ్రైవర్ అని అవమానించారని ధనుష్ ఆవేదన చెందాడు . 

Hero Dhanush

ధనుష్ తండ్రి కస్తూరి రాజా దర్శకుడు. ఆయన అన్నయ్య సెల్వ రాఘవన్ కూడా దర్శకుడు అలాగే నటుడు. సూపర్ స్టార్ రజినీకాంత్ బంధువు అవుతాడు. అందుకే తన పెద్దమ్మాయి ఐశ్వర్యను ఇచ్చి వివాహం చేశాడు. నెపో కిడ్ గా ధనుష్ పరిశ్రమలో అడుగుపెట్టాడు. 

Dhanush

ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా... హీరో అనగానే మినిమమ్ ఫీచర్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మంచి రంగు, ఎత్తు, శరీర సౌష్టవం ఉండాలని అనుకుంటారు. ఇవి ఉన్నోళ్లే సక్సెస్ అయ్యారని కాదు కానీ... హీరో అనగానే గుర్తుకు వచ్చే లక్షణాలు ఇవి. 

దీనికి పూర్తి భిన్నంగా ఉంటాడు ధనుష్. గాలికి ఎగిరిపోతాడేమో అనిపించే బక్క పలుచ శరీరం, నల్లని వర్ణం, ఓ మోస్తరు హైట్, కోల మొఖంతో చాలా సదా సీదాగా ఉంటాడు. 2002లో ధనుష్ తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్ర టైటిల్ తుల్లువద్దొ ఇలమై. 

Dhanush 50

ధనుష్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసి అందరు షాక్ అయ్యారు. ఇతను హీరోనా అని ఎద్దేవా చేశారు. ధనుష్ రెండో చిత్రానికి అన్నయ్య సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెట్స్ లో ధనుష్ కి తీరని అవమానం జరిగిందట. ఆటో డ్రైవర్ అని ఎగతాళి చేశారట. 

లుక్ పట్ల విమర్శలు ఎదుర్కొంటున్న ధనుష్ వద్దకు కొందరు వచ్చి హీరో ఎక్కడ అని అడిగారట. ధనుష్ వేరే వ్యక్తిని చూపించి అతనే హీరో అన్నాడట. కానీ వాళ్లకు తెలిసిపోయిందట. ఆటో డ్రైవర్ లా ఉన్నావు నువ్వు హీరో ఏంట్రా అన్నారట. ధనుష్ ఆవేదనతో కారులో  కూర్చుని ఏడ్చాడట. 

ఈ విషయాన్ని ధనుష్ ఓ సందర్భంలో వెల్లడించాడు. కట్ చేస్తే ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు ధనుష్ సాధించాడు. రెండుసార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగా రెండు అవార్డులు ఆయన పొందారు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించాడు. అందుకే మన లుక్ గురించి ఇతరులు చేసే కామెంట్స్ లెక్క చేయకూడదు అని ధనుష్ అంటాడు.. 
 

click me!