''ఏమయ్యా చంద్రబాబు ... మాలాంటి వృద్దులపైనా నీ ప్రతాపం, ఎలా గెలుస్తావో చూస్తాం''

By Arun Kumar PFirst Published May 2, 2024, 12:43 PM IST
Highlights

మే నెల వచ్చింది... ప్రతి నెల లాగే పెన్షన్ డబ్బులు చేతుల్లో పడతాయని వృద్దులు, వికలాంగులు భావించారు. కానీ చంద్రబాబు ఆండ్ బ్యాచ్ చేసినపనికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందని ఊహించలేమని వృద్దులు వాపోతున్నారు. 

అమరావతి : ''ఏమయ్యా చంద్రబాబు... నీ రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకుంటావా... పేదోళ్లకు మంచి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కుట్రలు పన్నుతావాా... మమ్మల్ని అరిగోస పెడుతున్న నీకు ఓటేయడం కాదు వేరేవాళ్లతో కూడా ఓటేయనివ్వం... సుపరిపాలన అందిస్తూ మాకు అండగా నిలిచిన మా బిడ్డ జగన్ కే ఓటేసి గెలిపిస్తాం'' ఇది ప్రస్తుతం వృద్దులు, వికలాంగుల మాట. 

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకే చేర్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు ఆండ్ బ్యాచ్ ఎప్పటినుండో టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకుని వాలంటీర్ల సేవలను అడ్డుకున్నారు. దీంతో ప్రజలకు పట్టించుకునేవారు కరువయిపోయారంటూ వైసిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ముఖ్యంగా వృద్దులు, వికలాంగులు చంద్రబాబు నాయుడు నిర్వాకంతో నానా ఇబ్బందులు పడుతున్నారట. ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటికే వచ్చి చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టే వాలంటీర్లు ఈ నెల రాలేదు. దీంతో పెన్షన్ డబ్బుల కోసం చేతకాని ఆవ్వాతాతలు, దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మండుటెండలో, నడవలేని స్థితిలో, బారెడు దూరం క్యూలైన్లలో నిలబడి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. తమ పరిస్థితికి కారణమైన చంద్రబాబును, ప్రతిపక్ష కూటమికి అవ్వాతాతలు శాపనార్ధాలు పెడుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. 

బ్యాంక్ అకౌంట్ వున్నవారు కష్టమో నష్టమో పెన్షన్ డబ్బులు తెచ్చుకుంటున్నారు. మరి అకౌంట్ లేనివారి పరిస్థితో... వాళ్లు తమ పెన్షన్ డబ్బులు ఎలా పొందాలో కూడా అర్థంకాని పరిస్థితి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ప్రతినెలా టంచనుగా ఒకటో తారీఖున పెన్షన్ డబ్బులు వచ్చాయి... ఇప్పుడు మాత్రం డబ్బులు వస్తాయో రావో తెలియని పరిస్థితి. ఇలా తమ చేతికాడికి వచ్చే డబ్బులను లాక్కున్న చంద్రబాబుపై వృద్దుల సీరియస్ అవుతున్నారు. 

ప్రతి నెల ఒకటో తేదీన వచ్చే పెన్షన్ డబ్బులతో సరుకులు తెచ్చుకోవడమో, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు వైద్యం కోసమే, మందుల కోసమో ఉపయోగించేవారు వృద్దులు. కానీ ఈ నెల రెండో తారీఖు వచ్చినా వారి చేతుల్లో డబ్బులు పడలేదు. దీంతో వృద్దులు, వికలాంగులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. తమ ఆత్మగౌరవాన్ని చంపుకుని ఎవరి సాయమో తీసుకుని బ్యాంకుల వద్ద బారులు తీరాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వీడియో

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఏ బ్యాంకు వద్ద చూసిన వృద్దులు, వికలాంగులే కనిపిస్తున్నారు. ఉదయమే బ్యాంకు తెరిచేకంటే ముందే వెళ్లి క్యూలైన్లు కడుతున్నారు...గంటలకు గంటలు పడిగాపులు పడి బ్యాంకులోకి వెళుతున్నారు. అక్కడ ఎవరి సాయమో తీసుకుని విత్ డ్రా ఫారం నింపి డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా ఎండలో బ్యాంకుల పడిగాపులు కాస్తున్న కొందరు వృద్దులు అనారోగ్యం పాలవుతున్నారని వైసిపి నాయకులు చెబుతున్నారు. 

అడవుల్లో , గుట్టల్లో వున్న తమకు పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు వాలంటీర్లు వచ్చేవారని వృద్ధులు చెబుతున్నారు. కానీ  ఇప్పుడు చంద్రబాబు వల్ల కిలోమీటర్లకు కిలోమీటర్లు ఎండలో ప్రయాణించి బ్యాంకుల వద్దకు రావాల్సిన పరిస్థితి దాపురించిందని అంటున్నారు. నీ స్వార్థ రాజకీయాల కోసం ఈ వయసులో వున్న తమను ఇబ్బంది పెట్టడం అవసరమా చంద్రబాబు? అంటూ ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ ను నేరుగా ఎదుర్కోలేక తమలాంటి  నిరుపేద వృద్దులు, వికలాంగుల జీవితాలతో ఆడుకుంటావా? అంటూ చంద్రబాబుపై మండిపడుతున్నారు. 

కొన్ని బ్యాంకుల వద్ద అవ్వాతాతల పరిస్థితి మరింత దారుణంగా వుంది. పొద్దునే నిద్రలేచి ఏడెనిమిది గంటలవరకు బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు వృద్దులు. బ్యాంకు తెరిచేవరకు పెద్ద కూలైన్ తయారవుతోంది. గంటలతరబడి ఈ క్యూలైన్ లో నిలబడితే తీరా లోపలికి వెళతారన్న సమయంలో సర్వర్ బిజీ బోర్డులు వెలుస్తున్నాయి.  ఇంత ఎండలో నిలబడి గంటలు వెయిట్ చేసినా ఫలితం లేదు... రేపు రమ్మని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. తర్వాతి రోజు కూడా ఇదే పరిస్థితి వుంటోంది. హాయిగా ఇంట్లో కూర్చుని పెన్షన్ డబ్బులు తీసుకునే తాము ఇలా బ్యాంకుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణమని అంటున్నారు. తమకు ఇంత నరకం చూపిస్తున్న అతడిని, ఆ కూటమికి ఓటేసే ప్రసక్తే లేదని వృద్దులు చెబుతున్నారు.

click me!