ఏడేళ్ల వయస్సులో దగ్గర బంధువు లైంగిక వేధింపులు, ఈ మధ్యనే క్షమాపణ చెప్పాడు..కానీ

First Published May 2, 2024, 12:23 PM IST

తనపై లైంగిక దాడి చేసింది మరెవరో కాదని..తమకు బాగా  “సమీప బంధువు” అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే... 

Maninee De


భారత్‌లో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు రిపోర్ట్ లు  చెప్తున్నాయి. ప్రతి రోజు ఆ వేధింపులకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రజల్లో అసహనాన్ని పెంచుతూనే ఉంది. అయితే ఈ వేధింపుల పర్వం ఇప్పటి నుంచే కాదు చాలా ఏళ్లగా జరుగుతున్నట్లు ఆ భాధితులు వచ్చి చెప్తున్నప్పుడు మనకు బాధకలుగుతుంది. ముఖ్యంగా  ఏడు ఎనిమిదేళ్ల  చిన్నారులపై జరిగిన అత్యాచార ఘటనలపై మనమంతా నిరసించాల్సిన అవసరం ఉంది. తాజాగా ఓ సినీ,టీవీ ఆర్టిస్ట్ తను చిన్న తనంలో అనుభవించిన లైంగిక వేధింపులు గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది.

Maninee De


 ఫ్యాషన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వంటి చిత్రాలతో పాటు అనేక ప్రముఖ టెలివిజన్ షోలలో భాగమైన నటి మణినీ దే. ఆమె తాను ఏడేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు ఇటీవల ఇంటర్వూలో  వెల్లడించింది. నటి  ఆ ఎక్సపీరియన్స్ ని చాలా బాధాకరమైందిగా  వివరించింది.  ఆ తర్వాత ఆమె దానిని ఎలా డీల్ చేసిందో  చెప్పుకొచ్చింది.

Maninee De


 ఇంటర్వ్యూలో, మణినీ మాట్లాడుతూ, "నేను చిన్నప్పుడు తెలియకుండా రాక్షసుల బారిన పడ్డాను. వాళ్లు చీకటిరాక్షసులు. ధైర్యంగా వెలుగులోకి రాలేదు. ఆ బాద, నన్ను ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉంది. అలాంటి రాక్షసులకు బుద్ది చెప్పే వయస్సు కాదు అది. కానీ కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది అంది నిర్వేదంగా.  

Maninee De


తనకు జరిగిన లైంగిక వేధింపులు గురించి  చాలా ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులతో షేర్ చుసుకున్నట్లు నటి తెలిపింది. తనపై లైంగిక దాడి చేసింది మరెవరో కాదని..తమకు బాగా  “సమీప బంధువు” అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే... ఈ విషయాన్ని మా అమ్మానాన్నలకు  తెలియజేసినప్పటికీ, వారు ఆ వ్యక్తిపై ఎలాంటి చర్య తీసుకోలేదని  చెప్పుకొచ్చింది.

Maninee De


ఆ చిన్న వయస్సులో నేను ఎదురు తిరిగి ఏమి చెయ్యలేకపోయాను. కానీ  విచిత్రంగా, అతను ఐదారు సంవత్సరాల క్రితం నాకు క్షమాపణ చెప్పటానికి పిలిచాడు. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసాడు. అతను కళ్లు దీనంగా నన్ను చూస్తూ.. 'నన్ను నిజంగా క్షమించు' అన్నట్లుగా ఆశగా ఉన్నాడు. అతను  పూర్తిగా నిస్సత్తువగా ఉన్నాడు.  నేను చెప్పేది ఒక్కటే . అంతా ఆ భగవంతుడుకి తెలుసు. ఆ భాదాకరమైన రోజుల్లో ఆయన్ను ఆర్తిగా నేను ప్రార్థించాను. దాని ఫలితమేనేమో అతను చాలా అనారోగ్యంతో కదలలేని శారీరక స్థితిలో ఉన్నాడు.  ఈ ప్రపంచంలో కర్మ ఉంది అని అర్దమైంది," అని ఆమె చెప్పింది.

Maninee De


ఇక ఆ  బాధను ఎలా అధిగమించిందో మణినీ చెప్పుకొస్తూ... "నేను ఇంగ్లీషులో చెప్పాలంటే ఒక రకంగా ట్రాన్స్‌మ్యూట్ అయ్యాను. ఆ బాధను మర్చిపోవటానికి నేను పుస్తకాలు చదవడం, రాయడం ప్రారంభించాను. నేను పద్యాలు రాసేదాన్ని.  నాతో నేనే ఆడుకునేదాన్ని. నాతో నేనే మాట్లాడుకునే దాన్ని. అలా నాలోకి నేను వెళ్లిపోయాను, "ఆమె పంచుకున్నారు.

Maninee De


నేను ఈ క్రమంలో నన్ను నేను ఓదార్చుకుంటూ ఎదిగాను. బాధను దిగమింగిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ ఓ థెరిపిస్ట్ అని అయ్యాను. నాలాంటి ఎంతోమందికి వారి బాధలను హీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎవరెంత క్షమాపణ చెప్పినా జరిగింది ఏదీ వెనక్కి తిరిగి రాదు. 

Maninee De


నా కూతురుతో ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాను. అలాంటివి ఏమన్నా జరిగితే సిగ్గు,మొహమాటం లేకుండా నాతో షేర్ చేసుకోమని కోరాను. ఇతరులకు ఇలాంటి విషయాల నుంచి బయిటపడేందుకు నాతో పాటు ఆమె కూడా సాయిం చేస్తోంది. ఇదొక హీలింగ్ ప్రాసెస్. ధైర్యంగా ఉండి ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవటం మేము ట్రైనింగ్ ఇస్తూంటాను. 

Maninee De


ఇక భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న టీవీ, మొబైల్ మీడియా కారణంగా కూడా ఈ కేసులు ఎక్కువగా బయటికొస్తున్నాయి . చట్టపరంగా ‘రేప్’కి సంబంధించిన నిర్వచనం కూడా మారిపోయింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రతి కేసునూ పోలీసులు తప్పనిసరిగా నమోదు చేయాలన్న నిబంధనా అమల్లోకి వచ్చింది. ఇటీవల కశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో లైంగిక వేధింపులపై చర్చ మరింత విస్తృతమైంది. 

Maninee De


ఏప్రిల్‌‌లో కేసు విచారణ మొదలైన నాటి నుంచి చర్చ నలుగుతూనే ఉంది. కశ్మీర్ రేప్ కేసుతో పాటు అలాంటి మరెన్నో ఘటనలు తనని తీవ్రంగా కలచివేశాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. 12ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైనవారికి మరణ శిక్ష విధించేలా చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది. 

click me!