బయటకు వెళ్లినప్పుడు చాలా చోట్ల మరుగుదొడ్ల సౌకర్యాలు ఉండవు. ఇలాంటి సమయంలో మూత్రాన్ని చాలా సేపటి వరకు ఆపాల్సి వస్తుంది. చాలాసార్లు మనం 2 నుంచి 3 గంటల వరకు మూత్రాన్ని ఆపుతుంటారు. ఇది చాలా కామన్. కానీ ఇలా మూత్రాన్ని ఆపడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అసలు మూత్రాన్ని ఇలా ఏపితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మూత్రాన్ని ఆపడం
మన వయసును బట్టి మూత్రాన్ని కొంతసేపటి వరకు మూత్రాన్ని ఆపొచ్చు. సాధారణంగా చిన్న పిల్లలు వారి మూత్రాన్ని 1 నుంచి 2 గంటల పాటు ఆపుకోగలుగుతారు. అదే పెద్ద పిల్లలు అయితే 2 నుంచి 4 గంటల పాటు మూత్రాన్ని ఆపుకుంటారు.
మూత్రాన్ని ఆపడం హానికరం
పెద్దల గురించి మాట్లాడితే.. ఒక వయోజనుడు సుమారుగా మూత్రాన్ని 6 నుంచి 7 గంటల పాటు ఆపొచ్చు. కానీ మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే?
మూత్రాశయ కండరాలపై ప్రభావాలు
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం వల్ల మీ మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల మీకు మూత్రాన్ని ఆపుకునే సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోతుంది. అలాగే మూత్రం లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
కటి నొప్పి
మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మీకు కటి నొప్పి వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కటి తిమ్మిరిగా కూడా మరే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరు మూత్రాశయాన్ని ప్రతి కొన్ని నిమిషాలకోసారి ఖాళీ చేయాలి. ఇది యూటీఐ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.
urine
మూత్రాశయం సాగదీత సమస్య
మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మీ మూత్రాశయం సాగదీయబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఆ తర్వాత మూత్ర విసర్జన చేయడం మీకు చాలా కష్టంగా ఉంటుంది.
కిడ్నీ స్టోన్
మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే.. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మళ్లీ ఏర్పడతాయి.