జాబ్ దొరకట్లేదా? అయితే 62,000 కంపెనీలున్న ఈ సిటీకి వచ్చేయండి

First Published | Nov 26, 2024, 2:48 PM IST

మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? మీరున్న చోట నోటిఫికేషన్స్ ఎక్కువగా లేవా? అయితే ఈ సిటీకి వచ్చారంటే మీకు కచ్చితంగా జాబ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సిటీలో ఏకంగా 62,000 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల జీతాలు కూడా ఇతర నగరాల కంటే ఎక్కువ. అంతేకాకుండా ఈ సిటీలో ఎలాంటి జాబ్ అయినా ఈజీగా దొరుకతుంది. ఆ సిటీ గురించి, అక్కడ ఉద్యోగాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

చదువుకొనే వారిలో చాలా మంది లక్ష్యం జాబ్ సంపాదించడం, ఫ్యామిలీని బాగా చూసుకోవడం. అంతే కదా..? చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి చివరికి డిగ్రీ, పీజీ పట్టాలు సంపాదిస్తే బయట మార్కెట్ లో జాబ్స్ దొరకడం లేదు. తీరా దొరికినా చాలా తక్కువ జీతాలు ఇస్తామంటున్నారు. అప్పులు చేసి చదువుకున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇచ్చే జీతాలు సరిపోక అప్పులు తీర్చలేక ఎంప్లాయిస్ పడే అవస్థలు మామూలుగా ఉండవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకున్న రంగంలో ఉద్యోగం సంపాదించడం మరింత కష్టంగా మారింది.  

జాబ్స్ రాకపోవడానికి మరో ముఖ్యమైన రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం. చదువంతా తెలుగు మీడియంలో చదివి, అర్థం కాని ఇంగ్లీష్ బ్యాగ్రౌండ్ లో జాబ్స్ చేయాల్సి రావడంతో చాలా మంది ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ కాలేకపోతున్నారు. ఇలా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లిన రిజక్షన్స్ తప్పడం లేదు. దీంతో ఉద్యోగాలు లేవని చాలా మంది అనుకుంటున్నారు. అయితే జాబ్స్ అనేవి కేవలం స్కిల్డ్ పర్సన్స్ కి మాత్రమే ఈజీగా వస్తున్నాయి. అందువల్ల చదువు కంటే ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. 

Latest Videos


ఒకవేళ మీకు ఉద్యోగం లేకపోయినా, లేదా చేస్తున్న జాబ్ నచ్చకపోయినా ఆ సిటీకి వెళ్లారంటే మీరు సూటైన జాబ్ సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సిటీ పేరు బెంగళూరు. కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో సుమారు 62,000 కంపెనీలు ఉన్నాయి. మీరు కనుక ఈ నగరానికి వెళ్తే కచ్చితంగా జాబ్ సంపాదిస్తారు. 

పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ నగరం అన్ని రంగాల్లోనూ వేగంగా డెవలప్ అవుతోంది. ముఖ్యంగా టెక్ సపోర్ట్ కంపెనీలు తమ బ్రాంచ్ లను ఏర్పాటు చేయడానికి బెంగళూరునే ఫస్ట్ ఆప్షన్ గా తీసుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలయితే పోటాపోటీగా ఆఫీసులు నిర్వహిస్తున్నాయి. 

బెంగళూరు ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలను అధిగమిస్తోంది. గత 10 సంవత్సరాల గణాంకాల ప్రకారం 2012-13లో కోల్‌కతాలో 6,393 కంపెనీలు ఉండగా తర్వాత అవి 5,899కి తగ్గాయి. వీటిల్లో చాలా కంపెనీలు బెంగళూరుకు షిప్ట్ అయినట్లు తెలుస్తోంది. 

బెంగళూరులో 2,000 కంటే ఎక్కువ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. అక్కడ ఇంజనీర్ల జీతాలు కూడా ఇతర నగరాల కంటే ఎక్కువ. అంటే ఇతర సిటీలతో పోల్చితే 13% నుండి 33% ఎక్కువ జీతాలు ఇక్కడ ఇస్తున్నారు. 

ఒక నివేదిక ప్రకారం బెంగళూరులో ఇంజనీర్ల స్టార్టంగ్ సంవత్సర జీతం రూ. 8.8 లక్షలు ఉంది. ఇదే కోల్‌కతాలో అయితే రూ. 5.9 లక్షలు మాత్రమే. బెంగళూరులో బ్లూ-కాలర్ కార్మికుల నెలవారీ జీతం కూడా రూ.16,498 రూపాయలు ఉందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తున్నాయి. ఇదే కోల్‌కతాలో అయితే రూ.14,039 రూపాయలు మాత్రమే. ఇంకో కొత్త విషయం ఏంటంటే.. బెంగళూరులో మొత్తం జనాభాలో 25% పాస్‌పోర్ట్ హోల్డర్లు ఉన్నారు. అంటే ఇక్కడ జాబ్ చేస్తే ఫారెన్ ఆఫర్స్ కూడా త్వరగా వస్తాయన్న మాట. అందువల్ల మీకు జాబ్ కావాలంటే బెంగళూరు వెళ్లండి. కచ్చితంగా మీరు అనుకున్నరంగంలో జాబ్ సంపాదిస్తారు. 

click me!