ఒత్తిడికి గురవుతున్నారా.. అయితే ఇది ట్రై చెయ్యండి!

First Published Oct 26, 2021, 8:23 PM IST

మనసు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా (Healthy) ఉండగలం. మనసుకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాతో (Yoga) మహాభాగ్యమైనా ఆరోగ్యాన్ని అందుకోవడం. 
 

శరీరానికి వ్యాయామం (Exercise), సరైన ఆహార (Healthy food) నియమాలతో పాటు యోగా అవసరం. యోగా మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని, మనస్సును సరైన దారిలో పెట్టి రెండింటిని సమానంగా ఉంచెదే యోగా. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
 

ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో ఒత్తిడి (Stress) అనే సమస్య అందరినీ వెంటాడుతుంది. ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటప్పుడు ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ముఖ్య ఔషధంగా (Medicine) పనిచేస్తుంది. కాబట్టి యోగా చేయుటకు సరైన సమయాన్ని కేటాయించాలి.
 

మనస్సుకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస (Breathing) మీద ధ్యానం పెట్టి చేసేదే యోగా. యోగా చేయడం వల్ల మన ఆరోగ్యానికి (Health) ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
 

యోగా శరీరానికి (Body), మనసుకు (Mind) మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేసి మనస్సును మామూలు స్థితికి తీసుకొస్తుంది. యోగా చేయడం వల్ల మనిషి ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 

నరాల (Nerve) పనిచేసే తీరులో అడ్డంకులు ఉంటే తొలగిస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎముకలు (Bones) దృఢంగా శక్తివంతంగా మారుతాయి. నిద్ర లేమి సమస్యలను దూరం చేస్తుంది.
 

ప్రతి రోజు యోగా (Yoga) చేయడం ద్వారా రక్త ప్రసరణ బాగా ఉంటుంది. గుండె సమస్యలు (Heart Problems) తగ్గుతాయి. జీర్ణక్రియ వ్యవస్థ సరైన పద్ధతిలో ఉండటానికి యోగా మంచి మందు అని చెప్పవచ్చు. శరీర కండరాలను, గుండె కండరాలను బలపరుస్తుంది. శరీర కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. బరువును తగ్గిస్తుంది. అవయవాల పనితీరుకు సహాయపడుతుంది.

click me!