ఫోర్ ప్లే తో ఇన్ని ప్రయోజనాలున్నాయా?

First Published Jun 1, 2023, 9:37 AM IST

సెక్స్ లో పాల్గొనడానికి ముందు కొంతమంది ఫోర్ ప్లేలో పాల్గొంటుంటారు. దీనివల్ల సెక్స్ ను మరింత  ఆస్వాధించమే కాదు.. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు తెలుసా? 
 

Image: Getty Images

నిజానికి సెక్స్ రెండు శరీరాల కలయికే కాదు.. ఇదెన్నో రోగాలను దూరం చేస్తుంది. సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. గుండెను ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. సెక్స్ కూడా మంచి వ్యాయామం లాంటిదే. సెక్స్ భాగస్వాముల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమను రెట్టింపు చేస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది. ఏదేమైనా సెక్స్ తో శారీరక, మానసిక, ఆనందకరమైన ప్రయోజనాలు బోలెడు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ సెక్స్ పరంగా చాలా మంది ఆరోగ్య ప్రయోజనాలను ఎక్కువగా విస్మరిస్తారు. 

Image: Getty Images

ఫోర్ ప్లే గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సెక్స్ అత్యంత ముఖ్యమైన భాగాలలో ఇదీ ఒకటి. ఈ ఫోర్ ప్లేలో సంభోగం తప్ప మిగతావన్నీ ఇమిడి ఉంటాయి. కౌగిలించుకోవడం నుంచి ముద్దు పెట్టుకోవడం వరకు ప్రతి ఒక్కటీ ఉంటాయి. ఫోర్ ప్లే అంటే మరేదో కాదు.. సెక్స్ కు ముందు జరిగే చర్యనే ఫోర్ ప్లే అంటారు. నిజానికి ఇది ఇద్దరికీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

స్ట్రెస్ బస్టర్

ఫోర్ ప్లే తో బోలెడు లాభాలు ఉన్నాయి. రతిక్రీడలో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లేలో పాల్గొనడం వల్ల ఒత్తిడంతా మటుమాయం అవుతుంది. ఎన్నో అధ్యయనాలు కూడా దీనిని నిరూపించాయి. అంతేకాదు వ్యక్తిగత అనుభవాలు కూడా ఈ పరిశోధనల వాదనలకు మద్దతునిచ్చాయి కూడా. ఫోర్ ప్లే హృదయ స్పందన రేటును పెంచుతుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. అయితే ఫోర్ ప్లేలో ఎంత ఎక్కువ సేపు పాల్గొంటే మీకు అంత ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. 

జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది

భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి ఫోర్ ప్లే వల్ల ప్రైవేట్ భాగాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో జననేంద్రియాలు మరింత విస్తరిస్తాయి. దీంతో మీకు లైంగిక కోరికలు రేకుత్తుతాయి. ఫోర్ ప్లే ఆక్సిటోసిన్, సెరోటోనిన్, డోపామైన్ వంటి హార్మోన్లను రిలీజ్ చేయడానికి సహాయపడుతుంది. ఫోర్ ప్లే ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆ తర్వాత సెక్స్ కు ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. 
 

స్పెర్మ్ పరిమాణాన్ని మెరుగుపరుస్తుంది

ఎక్కువసేపు ఫోర్ ప్లే చేయడం వల్ల పురుషుల వీర్యకణాలపై సానుకూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫోర్ ప్లే లో పాల్గొనడం వల్ల పురుషులు ఎంతో ఆనందాన్ని పొందుతారట. తర్వాత వారు స్ఖలనం చేసే వీర్యం పరిమాణంపై కూడా ఇది సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది స్పెర్మ్ కౌంట్ ను బాగా పెంచుతుందని నమ్మకం. 
 

భావోద్వేగ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది

ఫోర్ ప్లే లో పాల్గొప్పుడు మంచి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి వారిని ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే అతను లేదా ఆమెను మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. సెక్స్ జంటను ఒకే దగ్గరగా ఉంచితే.. ఫోర్ ప్లే మంచి భావోద్వేగాలతో బంధాన్ని ముడిపెడుతుంది.  
 

ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

సెక్స్, ఫోర్ ప్లేలు కలిసి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాల్ని 100 శాతం పూర్తిగా తగ్గిస్తాయని గ్యారంటీ ఇవ్వలేం. కానీ ఈ లైంగిక చర్యను పూర్తిగా చేయడం వల్ల గుండె సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బెల్ ఫాస్ట్ లోని క్వీన్స్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో వారానికి రెండు లేదా మూడు సార్ల కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే వ్యక్తులకు గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.

ఇతర ప్రయోజనాలు

ఫోర్ ప్లే మాత్రమే మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి, మీ నిద్రను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే సెక్స్ ను మరింత ఆస్వాధించడానికి సహాయపడుతుంది. 

క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి.

ఫోర్ ప్లే రక్త ప్రసరణను పెంచుతుంది. కాబట్టి ఇది మీ చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది. 

click me!