రామ్ చరణ్ సంచలన నిర్ణయం... టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్!

Published : Apr 29, 2024, 09:07 PM IST
రామ్ చరణ్ సంచలన నిర్ణయం... టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్!

సారాంశం

హీరో రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఆయన షూటింగ్ కి రెండు నెలలు బ్రేక్ ఇవ్వనున్నాడట. ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.   

మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో బిజీ. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. గేమ్ ఛేంజర్ ఇప్పటికే విడుదలకు సిద్ధం కావాల్సింది. అయితే శంకర్ భారతీయుడు 2 షూటింగ్ బాధ్యతలు కూడా తీసుకోవడంతో ఆలస్యం అయ్యింది. గతంలో వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 చిత్రాన్నిమరలా పట్టాలెక్కించారు. ఎక్కువ ఫోకస్ అక్కడ పెట్టిన శంకర్ గేమ్ ఛేంజర్ నిర్లక్ష్యం చేశాడనే వాదన ఉంది. 

కాగా గేమ్ ఛేంజర్ సెట్స్ పై ఉండగానే కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ 16 చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది విలేజ్ నేపథ్యంలో సాగే కథ. ఉత్తరాంధ్ర కుర్రాడిగా రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. 

ఆర్సీ 16 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా రామ్ చరణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఆయన రెండు నెలలు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడట. ఈ సమయాన్ని ఆయన ఫ్యామిలీ తో గడిపేందుకు కేటాయిస్తారట. భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారతో ఉపాసన వెకేషన్ కి వెళుతున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

ఇక గేమ్ ఛేంజర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. దర్శకుడు శంకర్ తన మార్క్ సామాజిక సమస్యలను కథలో జోడించారు. రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'జరగండి' సాంగ్ ఆదరణ దక్కించుకుంది. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode: విశ్వను కాపాడి కుటుంబానికి షాకిచ్చిన అమూల్య, పగబట్టిన పాములా వల్లి
Roja Selvamani: లెనిన్ మూవీ రిజల్ట్ ముందే తేల్చేసిన రోజా, షాకింగ్ కామెంట్స్.. నాగార్జున, అఖిల్ పై ఇలా..