డిప్రెషన్ లో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు..? గుర్తించడమెలా?

First Published Jun 23, 2021, 11:51 AM IST

చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. వాటన్నింటిలో.. డిప్రెషన్ అనేది చాలా పెద్ద రోగం. దీని వల్ల బాధపడుతున్నవారు సైతం ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ల మంది.. ఈ డిప్రెషన్ తో బాధపడుతున్నారట.
undefined
ఏదైనా కోల్పోయిన సమయంలో, ఎక్కువ ఏడుస్తూ బాధపడే విషయంలో చాలా మంది ఈ డిప్రెషన్ కి గురౌతున్నారు. తమకు నచ్చిన వ్యక్తి మరణించినప్పుడు.. ప్రేమలో బ్రేకప్, ఉద్యోగం పోవడం ఇలాంటి కారణాల వల్లే ఎక్కువ మంది డిప్రెషన్ కి గురౌతున్నట్లు సర్వేలో తేలింది.
undefined
కాగా.. చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం..
undefined
ఏదైనా అనుకోని బాధకలిగించే సంఘటన జరిగినప్పుడు మనకు దుఖం రావడం చాలా సహజం. అయితే... దానిని అనుభవించడమే బాధ. ఒక వ్యక్తి విచారంలో ఉన్నప్పుడు కూడా.. ఒక్కోసారి గతంలోని సంతోషకరమైన విషయాలు గుర్తుకు వస్తాయి.
undefined
వాటి వల్ల మరింత బాధ కలిగించే అవకాశం ఉంది. అయితే.. ఆ బాధ నుంచి త్వరగా బయటకు రాకుండా.. ఎక్కువ సేపు ఒంటరిగా.. విచారంగా ఉంటున్నారంటే.. వారు నెమ్మదిగా డిప్రెషన్ లోకి వెళ్తున్నట్లు గుర్తించాలి.
undefined
ఎక్కువ విచారంగా ఉంటూ.. తాము కోల్పోయిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ.. ఇతర ఏ పనిని పట్టించుకోకుండా ఉండటం వల్ల డిప్రెషన్ కి వెళ్లిపోయే అవకాశం ఉంది. కొందరికైతే సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. తమను తాము హానిపరుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.
undefined
డిప్రెషన్ లక్షణాలు..1. విచారంగా, నిరాశగా ఉండటం2. చిరాకు, ఆత్రుత, రెస్ట్ మోడ్, మూడీగా ఉండటం3. ఇష్టమైన కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం4. ఆకలి లేకపోవడం లేదా.. అతిగా తినడం5. బరువు తగ్గడం లేదా పెరగడం6. లైంగిక కోరిక అతిగా పెరగడం లేదా పనితీరు తగ్గడం7. చాలా నిద్రపోవడం లేదా చాలా తక్కువ నిద్రపోవడం8. ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం లేదా సాధారణ కార్యకలాపాలను పూర్తి చేయడంలో సమస్య9. అసహ్యం, నిస్సహాయత , అపరాధ భావన పెరిగిపోవడం10. అలసట11. ఆత్మహత్య లేదా ఆత్మహత్య ఆలోచనలుఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వారు కచ్చితంగా డిప్రెషన్ లో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి. లేదంటే.. మరింత ఇబ్బందిపడే ప్రమాదం ఉంది.
undefined
click me!