శృంగారం కూడా మంచి వ్యాయామమే.. ఎలాగంటే?

First Published Jun 8, 2023, 9:46 AM IST

శృంగారాన్ని క్రీడగా గుర్తించిన తొలి దేశంగా స్వీడన్ నిలిచింది. అసలు సెక్స్ మంచి వ్యాయామంగా ఎలా మారుతుంది? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Image: Getty Images

మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమను ఖచ్చితంగా చేయాల్సిందే. ఇందుకోసం జిమ్ కు వెళ్లడం నుంచి అవుట్ డోర్ యాక్టివిటీస్ వరకు దేనిలోనైనా పాల్గొనొచ్చు. వ్యాయామం మన శరీరాన్ని ఫిట్ గా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీకు తెలుసా? సెక్స్ కూడా ఒక మంచి వ్యాయామమే. సెక్స్ తో కలిగే ప్రయోజనాలు శారీరక ఆనందాన్నే కాదు ఇది మీ ఫిట్నెస్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. అసలు సెక్స్ మంచి వ్యాయామంగా ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Image: Getty Images

హృదయ స్పందన రేటును పెంచుతుంది

హృదయనాళ లేదా ఏరోబిక్ వ్యాయామాల మాదిరిగానే లైంగిక కార్యకలాపాల సమయాల్లో మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. పెరిగిన హార్ట్ రేట్ వల్ల మీ గుండె కండరాలు బలంగా మారుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు రక్తప్రవాహం కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. అలాగే మీ రోగనిరోధక శక్తి బలోపేతం  అవుతుంది. 

Image: Getty Images

కేలరీల బర్న్

సెక్స్ అనేది కేలరీల బర్నింగ్ యాక్టివిటీ. అందుకే సంభోగంలో పాల్గొనడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. అలాగే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. అయినప్పటికీ.. సెక్స్ లో ఎంత సేపు పాల్గొంటున్నారు, దాని తీవ్రత, శరీర బరువు వంటి కారకాలపై కేలరీల బర్నింగ్ ఆధారపడి ఉంటుంది. పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ జర్నల్ అయిన పిఎల్ఓఎస్ వన్ లో ప్రచురించబడిన ఒక చిన్న అధ్యయనం.. 20 ఏళ్లలో ఉన్న ఇరవై ఒక్క మంది ఆరోగ్యకరమైన జంటలు 24 నిమిషాల సెక్స్ సెషన్‌లలో.. ఫోర్‌ప్లేతో సహా.. పురుషులు సగటున 101 కేలరీలు అంటే నిమిషానికి 4.2 కేలరీలను బర్న్ చేశారని సూచించింది. అలాగే మహిళలు 69 కేలరీలు అంటే నిమిషానికి 3.1 కేలరీలను బర్న్ చేస్తారు. అయితే బర్న్ చేయబడిన కేలరీల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ లైంగిక కార్యకలాపం వల్ల మీ శరీరంలో ఉన్న మొత్తం కేలరీలను బర్న్ చేయడానికి దోహదం చేస్తుందని చూపిస్తుంది. 

Image: Getty Images

కండరాల ఆరోగ్యం

సెక్స్ శరీరంలోని అన్ని కండరాలను బాగా కదిలిస్తుంది. సెక్స్ లో పాల్గొన్న పొజీషన్స్, కదలికలను బట్టి మీరు మీ కోర్, కాళ్లు, గ్లూట్స్, ఎగువ శరీర కండరాలు పనిచేస్తాయి. క్రమం తప్పకుండా లైంగిక కార్యకలాపాలు ఈ కండరాల సమూహాలను టోన్ చేయడానికి, బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

Image: Getty Images

ఒత్తిడి నుంచి ఉపశమనం

శరీరానికి అవసరమైన ఫీల్ గుడ్ హార్మోన్లైన ఎండార్ఫిన్లను రిలీజ్ చేయడానికి సెక్స్ ఎంతో సహాయపడుతుంది. ఇవి మీరు ప్రశాంతంగా ఉండేందుకు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో సహాయపడతాయి. శృంగారంలో పాల్గొనడానికి ఉత్తమ సమయం ఉదయం. ఉదయపు సెక్స్ ఎవరికైనా రోజంతా మరింత రిలాక్స్డ్ గా, ఏకాగ్రతగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. మొత్తం మీద సెక్స్ చేయడం  చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Image: Getty Images

సమతుల్యత

కొన్ని సెక్స్ పొజీషన్స్ మీ శరీరాన్ని మరింత ఫ్లెక్లిబుల్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. వేర్వేరు సెక్స్ భంగిమలలో పాల్గొనడం వల్ల మీ కదలిక పరిధిని, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది కండరాలను సాగదీయడానికి, సడలించడానికి సహాయపడుతుంది. అందుకే క్రమం తప్పకుండా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనండి. ఇది మీ మొత్తం శారీరక పనితీరును కూడా పెంచుతుంది.
 

సెక్స్ ఎన్నో ప్రయోజనాలను కలిగించినప్పటికీ.. ఇది సాధారణ వ్యాయామ దినచర్యకు ప్రత్యామ్నాయంగా పరిగణించకూడదని నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఫిట్నెస్, ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఏరోబిక్ వ్యాయామాలు, బలం శిక్షణ వంటి శారీరక శ్రమలో పాల్గొనడం చాలా ముఖ్యం. 

click me!