బాలయ్య కూతురిని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. అప్పట్లో ఇంత జరిగిందా? 

First Published | May 1, 2024, 6:16 PM IST

సోషల్ మీడియాలో ఓ న్యూస్ తరచుగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. మహేష్ బాబు హీరో కూతురిని వివాహం చేసుకోవాల్సింది అట. బాలయ్య స్వయంగా అడిగినా నో అన్నారట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం... 
 

మహేష్ బాబు మిస్టర్ పర్ఫెక్ట్. వివాదరహితుడు. ఒక మంచి భర్త, గొప్ప తండ్రి అనడంలో సందేహం లేదు. సినిమా తర్వాత కుటుంబమే ఆయన ప్రపంచం. ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళిపోతారు. లేదంటే ఇంటికే పరిమితమై కుటుంబ సభ్యులతో గడుపుతారు. 

Mahesh Babu

వంశీ చిత్ర షూటింగ్ లో ప్రేమలో పడ్డాడు మహేష్ బాబు. ఆ చిత్ర హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని పిచ్చ పిచ్చగా ప్రేమించేశాడు. ఆ,ఆమె కూడా మహేష్ ని ప్రేమించడంతో వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది. చాలా కాలం నమ్రత-మహేష్ రహస్యంగా ప్రేమించుకున్నారు. 


Mahesh Babu

2005లో నమ్రతను మహేష్ బాబు రహస్య వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఉన్నప్పటికీ మహేష్ పెళ్లి విషయం మీడియాకు తెలియదు. అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా మహేష్ బాబు వివాహం జరిగింది. 

వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు గౌతమ్ కాగా, అమ్మాయి పేరు సితార. ఒక ప్రక్క కుటుంబాన్ని చూసుకుంటూనే మహేష్ బాబు సామాజిక సేవ చేస్తున్నారు. గుండె జబ్బుల బారిన పడిన చిన్నారులకు ఆపరేషన్ చేయిస్తున్నారు. రెండు గ్రామాలు దత్తత తీసుకుని మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 
 

Mahesh Babu


కాగా మహేష్ బాబు హీరో బాలకృష్ణ పెద్దమ్మాయి బ్రాహ్మణిని వివాహం చేసుకోవాల్సిందట.  వరుస హిట్స్ తో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న మహేష్ బాబును బాలకృష్ణ అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నారట. ఇదే విషయం మహేష్ తో బాలకృష్ణ మాట్లాడారట. మహేష్ సున్నితంగా బాలకృష్ణ ప్రపోజల్ ని తిరస్కరించాడట. 

Mahesh Babu

అప్పటికే మహేష్ బాబు హీరోయిన్ నమ్రతతో ప్రేమలో ఉండటం వలన బ్రాహ్మణిని మహేష్ బాబు చేసుకోను అన్నారట.దాంతో బాలకృష్ణ తన కుమార్తె బ్రాహ్మణిని మేనల్లుడు లోకేష్ కి యిచ్చి వివాహం చేశాడు. మహేష్ కి పెళ్ళైన రెండేళ్లకు నారా లోకేష్-బ్రాహ్మణిల వివాహం జరిగింది. కాగా మహేష్ ని బాలకృష్ణ అల్లుడు చేసుకోవాలని ప్రయత్నం చేశాడని ఎలాంటి అధికారిక సమాచారం లేదు.   
 

Latest Videos

click me!