టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..

First Published | May 1, 2024, 6:16 PM IST

మన టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు... వారిలో అత్యంత ధనవంతులు ఎవరు..? చేతినిండ సంపాదనతో పాటు.. వారసత్వంగా వచ్చిన డబ్బుతో రిచ్చెస్ట్ హీరోలుగా ఎదిగిన వారు ఎవరు..? 

సినిమా హీరోలంటే ఒక్క సారి స్టార్ డమ్ వస్తే చాలు.. వందల కోట్లు వేనకేసుకుంటుంటారు. ప్రస్తుతం స్టార్ హీరోలందరు ఒక్క సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టైర్ 2 హీరోలు కూడా 30 నుంచి 40 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు. దాంతో హీరోలు రిచ్చ్ గా మారుతున్నారు. ఇంతకీ మన తెలుగు ఇండస్ట్రీలో అందరికంటే రిచ్ హీరోలు ఎవరో తెలుసా..? 
 

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. కాని ఒకప్పుడు మాత్రం ఎన్టీఆర్, ఎఎన్నార్ , కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు.. ఇలా కొద్దిమంది హీరోలు మాత్రమే ఉండేవారు. ఆతరువాత కాలంలో హీరోలు పుట్టలు మాదిరి పుట్టుకొచ్చారు. పోటా పోటీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరోలు. 
 

జ్యోతికకు తలనొప్పిగా మారిన ప్రియమణి, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా..?

Latest Videos


ఒకప్పుడు హీరోల రెమ్యూనరేషన్ లక్షల్లో ఉండేది. అది ఇప్పుడు కోట్లకు వందల కోట్లకు పెరిగింది. అయితే అప్పటి హీరోలు ఇప్పటి హీరోలు తమ సంపాదనను స్థలాలు, బంగారం, ఇతర బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ రావడంతో.. వారి సంపద కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. అలానే చాలా మంది టాలీవుడ్ హీరోలు వేల కోట్లకు అధిపతులు అయ్యారు.. అవుతూనే ఉన్నారు. 
 

రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన మెగా పవర్ స్టార్..

ప్రస్తుతం  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో చాలామంది సినిమాలతో పాటు బిజినెస్ లు చేసి వేల కోట్లు సంపాదించి మంచి పొజిషన్ లో ఉన్నారు.ఇక టాలీవుడ్ లో అలా సంపాదన గట్టిగా ఉన్న హీరోలలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అక్కినేని నాగార్జున. ఆయన మంచి హీరో మాత్రమే కాదు.. మంచి బిజినెస్ మెన్ కూడా. కమర్షియల్ గా ఆలోచించి.. పక్కా ప్లానింగ్ తో వేల కోట్లకు అధిపతిగా ఎదిగాడు నాగ్. 
 

అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన సంపాదనలో ఎక్కువ శాతం నాగార్జునకే దక్కింది. ఇటు హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తూ.. అటు తన తండ్రి ఇచ్చిన ఆస్తిని.. స్టూడియోలను పెంచుకుంటూ.. పోతున్నాడు నాగ్. ఇక నాగార్జునకు ఒక అన్న ఉండగా.. ఆయనకూడా బిజినెస్ లలో రాణిస్తూ.. బాగా సంపాదించినట్టు సమాచారం. ఇటు నాగార్జున ఒక్కడి ఆస్తి.. దాదాపు  దాదాపుగా 12 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా . 

ఇక టాలీవుడ్ లో తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. కష్టపడి ఎదిగి తెలుగు ఇండస్ట్రీలో మెగా సాంమ్రాజ్యాన్ని స్థాపించాడు చిరు. బాలీవుడ్ లో కపూర్స్ ఫ్యామిలీ ఎలాగో.. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంతకంటే ఎక్కువే అని చెప్పాలి. 70 ఏళ్ళకు దగ్గరగా ఉన్నా.. ఏమాత్రం తగ్గని మెగాస్టార్.. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

చిరంజీవి సినిమాకు 50 కోట్లకు పైనే తీసుకుంటున్నారట. 157 సినిమాలు చేసిన చిరంజీవి.. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దాదాపు ఎన్నో ప్యాపారాల్లో ఓ చేయి వేసి ఉన్నారు. అటు రాజకీయాల్లో  కూడా ఓ ఏడెనిమిదేళ్ళు రాణించిని చిరంజీవి..  దాదాపు ఆస్తి అంతా కలుపుకుని దాదాపు 8 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా...  

ఇక  తరువాత స్థానంలో ఉన్నారు విక్టరీ వెంకటేష్.. ఆయన  సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. రామానాయుడు వారసుడిగా.. ఎంట్రీ ఇచ్చి.. సోంతంగా ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నారు. విక్టరీ ఫ్యాన్స్ మామూలుగా ఉండరు.. ఆయన అంట ఫ్యామిలీ ఆడియన్స్ పడిచచ్చిపోతారు. ఇక రామానాయుడు నుంచి వచ్చిన ఆస్తి.. వెంకటేష్ సంపాదించుకున్న ఆస్తి అంతా.. కలుపుకుని.. దాదాపు 5 వేల కోట్లు  ఉంటుందని అంచనా..

ఇక బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. ప్రస్తుతం రాజకీయంగా కూడా బలంగా ఉన్న నందమూరి నటసింహం.. బిజినెస్ లు అంటూ పెద్దగా పరుగులు పెట్టలేదు అందుకే.. సంపాదనపై కూడా ఆయనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఉన్న ఆస్తిని కాపాడుకుంటూ.. సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు బాలయ్య.. ఆయన ఆస్తి దాదాపు మూడు వేల కోట్లు ఉంటుందని అంచనా. 
ఇవన్నీ సోషల్ మీడియా సమాచారం ప్రకారం తెలుసుకున్నవే.. అసలుఆస్తుల విలువ ఎంటో చూడాలి. 

click me!