Health Tips: చక్కెరను ఎక్కువ తింటే ఈ జబ్బులు తప్పవు జాగ్రత్త..

First Published Jan 2, 2024, 10:47 AM IST

Health Tips: మన ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే వాటిలో మనం తినే ఫుడ్ ఒకటి. మనం ఏం తింటున్నాము? ఎంత తింటున్నామో చూసుకోవడం చాలా అవసరం. మీకు తెలుసా? మీ ఆహారంలో చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుది. లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అనారోగ్య సమస్యలకు మన ఆహారపు అలవాట్లే కారణమంటే ఎవరైనా నమ్ముతారా? అవును చెడు ఆహారాలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర మన శరీరానికి అవసరమే అయినా.. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి.
 

ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని గురించి వెళ్లడించింది. మన ఆహారంలో చక్కెరను  తగ్గించడమే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం.. పెద్దలు, పిల్లలు చక్కెర మొత్తాన్ని వారి మొత్తం శక్తి తీసుకోవడంలో 10 శాతం కంటే తక్కువ ఉంచాలి. ఈ మొత్తాన్ని 5 శాతం కంటే తక్కువకు తగ్గిస్తే.. ఇది అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఈ సూచన వెనుక శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వీటికంటే ఎక్కువ మొత్తంలో చక్కెరను ఎక్కువగా తీసుకుంటే ఎన్నో జబ్బులు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

శరీర కొవ్వును పెంచుతుంది

చక్కెర మన శక్తికి మూలం. కానీ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, టీ, కాఫీ మొదలైన వాటిలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీర కొవ్వును పెంచుతుంది. దీని వల్ల అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. ఈ విధంగా మీరు బరువు పెరగడం వల్ల మీ గుండె, కాలేయం రెండింటికీ మంచిది కాదు. అనారోగ్యకరమైన బరువు కూడా మిమ్మల్ని ఊబకాయానికి గురిచేస్తుంది.
 

sugar

పేలవమైన చర్మ ఆరోగ్యం

మీ ఆహారంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి మొటిమలు, అకాల వృద్ధాప్యం. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది మొటిమలకు కారణమవుతుంది. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
 

Image: Freepik

ఇన్సులిన్ నిరోధకత

మీ రోజువారి ఆహారంలో చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం తగ్గుతుంది. దీని వల్ల శరీరంలోని కణాలు ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించలేవు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ఇది డయాబెటిస్ కు  అతిపెద్ద కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. 

Sugar

హార్మోన్ల అసమతుల్యత

హార్మోన్లు సరిగ్గా ఉంటేనే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. కానీ మీ ఆహారంలో చక్కెర ఎక్కువగా ఉంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 
 

Image: Getty Images


చక్కెర వ్యసనం

చక్కెరను ఎక్కువగా తినడం వల్ల.. మీకు చక్కెరను పదేపదే తినాలన్న కోరిక కలుగుతుంది. దీనివల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి మారడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం వల్ల అలసట సమస్య వస్తుంది. 

click me!