శోభన్‌బాబుని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారో తెలుసా?.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణంరాజు, కృష్ణలకు ఉన్న తేడా అదే

First Published | Nov 24, 2024, 8:44 AM IST

శోభన్‌బాబుకి అమ్మాయిల్లో ఫాలోయింగ్‌ ఎక్కువ. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులకు సోగ్గాడికి ఉన్న తేడా అదే. మరి అదేంటో ఓ లుక్కేద్దాం. 
 

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు వచ్చినా, ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేసినా శోభన్‌బాబు స్థానం పదిలం. ప్రత్యేకం. ఆయనలా ఎవరూ ఉండలేరు, ఆయనకు ఎవరూ సాటిరారు. తెలుగు తెరపై వన్‌ అండ్‌ ఓన్లీ సోగ్గాడు ఆయనే. ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా సినిమాలు చేయడంలో శోభన్‌బాబుకి, మిగిలిన హీరోలకు ఒక స్పష్టమైన తేడా ఉంది. అందుకే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులకు సాధ్యంకానిది శోభన్‌బాబుకి సాధ్యమైంది.  
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అదేంటనేది చూస్తే అప్పట్లో అమ్మాయిల్లో ఫాలోయింగ్‌ విషయంలో శోభన్‌బాబు ముందుండేవారు. అమ్మాయిలే కాదు,  ఆంటీలు ఆయన్ని బాగా ఇష్టపడేవారు. అది మిగిలిన హీరోలకు అంతగా ఉండేది కాదు. లేడీస్‌ ఫాలోయింగ్‌ అనేది శోభన్‌బాబుకి ఉన్న ప్రత్యేకమైన అసెట్‌. ఆయన సినిమాలు బాగా ఆదరణ పొందడానికి వాళ్లు ఓ కారణం మాత్రమే కాదు, ప్రధాన కారణం కూడా. మరి ఎందుకు సోగ్గాడి సినిమాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లోకి బాగా వెళ్తాయి అనేది చూస్తే, ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వచ్చాయి. నిజంగానే షాక్‌కి గురి చేస్తాయి. 


శోభన్‌బాబు తన కెరీర్‌లో ప్రారంభంలో యాక్షన్‌ సినిమాలు చేశారు. మల్టీస్టారర్స్ చాలానే చేశారు. అయితే తనకంటూ ఓ స్టార్‌డమ్‌, ఇమేజ్‌, మార్కెట్‌ ఏర్పడ్డాక తన అభిమానుల కోసం సినిమాలు చేశారు. వారికి నచ్చే సినిమాలు చేశారు. యాక్షన్‌ మూవీస్‌ వెంట పరిగెత్తలేదు. ఒకటి అర అవికూడా చేస్తూనే ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేశారు.

భార్యాభర్తల అనుబంధం, వారి మధ్య వచ్చే గొడవలు, మొగుడూ పెళ్లాం మధ్య సంఘర్షణలు, అలకలు, రెండో భార్య ఉండటం. ఏ పరిస్థితుల్లో ఆయన రెండో భార్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరో అమ్మాయికి ఎందుకు ఆకర్షితుడు కావాల్సి వచ్చింది అనే అంశాల ప్రధానంగా శోభన్‌బాబు సినిమాలు చేయడం విశేషం. ఇవి మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా కనెక్ట్ అవుతాయి.

పైగా ఇంట్లో ఉండే ఇల్లాలుకి బాగా ఎక్కుతుంది. అందుకే మహిళా ఫ్యాన్స్ శోభన్‌బాబు సినిమాలను ఎగబడి చూసేవారు. ఈ విషయాన్ని సీనియర్‌ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు వెల్లడించారు. శోభన్‌బాబు సక్సెస్‌ సీక్రెట్‌ అని తెలిపారు. మిగిలిన హీరోలు కూడా ఇలాంటి సినిమాలు చేసిన అడపాదడపగానే చేశారని, ఎక్కువగా యాక్షన్‌ సినిమాలకు ప్రయారిటీ ఇచ్చారని, దీంతో ఆ లోటుని శోభన్‌బాబు భర్తి చేశాడని, ఆ ఆడియెన్స్ ని అభిమానులుగా చేసుకున్నారని ఆయన తెలిపారు.
 

Sobhan Babu

అంతేకాదు శోభన్‌బాబు సినిమాల్లో శృతి మించిన ఎక్స్ పోజింగ్‌ ఉండదు. మరోవైపు ఆయన పాత్ర ఆడవారికి గౌరవి ఇస్తూ మాట్లాడుతుంది. మహిళల విషయంలోనూ పాజిటివ్‌ దృక్పథంతో ఆయన పాత్రలుంటాయి. అది అమ్మాయిలకు మగాళ్లలో బాగా నచ్చే క్వాలిటీ. అందుకే వారు ఆకర్షితులు అవుతుంటారు.

ఇక హీరోయిన్లు కూడా ఆకర్షితులు కావడానికి కారణం బయటకు కూడా ఆయన నేచర్‌ అదే. ఆడవాళ్లకి చాలా గౌరవం ఇస్తారు. వారిని సరదాగా ఉంచే ప్రయత్నం చేస్తారు. పైగా అందగాడు. ఈ కారణంగానే ఆయన్ని హీరోయిన్లు కూడా చాలా మంది ఇష్టపడేవారు అని తెలిపారు సీనియర్‌ జర్నలిస్ట్. 
 

శోభన్‌బాబు ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనని తాను నిరూపించుకున్నారు. పెద్ద హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులకు దీటుగా ఎదిగారు శోభన్‌బాబు. మంచి ఏజ్‌లోనే ఆయన రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. జనంలో తాను ఎప్పుడూ సోగ్గాడిగానే ఉండిపోవాలని ఆయన నిర్ణయించుకుని సినిమాలకు గుడ్‌ బై చెప్పారు.

కానీ ఇప్పటికీ ఆడియెన్స్ హృదయాల్లో తన సినిమాలతో నిలిచిపోయారు. అంతేకాదు ఆర్థికంగానూ జీరో నుంచి కుభేరుడు అయ్యాడు. అప్పట్లో ఆయన్ని మించిన రిచ్చెస్ట్ హీరో మరొకరు లేరంటూ అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ఆయనే కింగ్‌ అని చెబుతుంటారు. 

read more:జగపతిబాబు చేసిన పనికి లక్షల్లో మోసపోయిన హీరో, ఇప్పటికీ ఇద్దరికి మాటల్లేవ్‌

also read: `బాహుబలి` డిజాస్టరా? నిర్మాతలకు భారీ నష్టం, కలెక్షన్ల గోల్‌ మాల్‌ వ్యవహారం బయటపెట్టిన సీనియర్‌ ప్రొడ్యూసర్‌
 

Latest Videos

click me!