Good News: UPI పేమెంట్స్ లిమిట్ పెంచిన RBI.. రోజుకు రూ.వేలల్లోనే పేమెంట్స్ చేయొచ్చు

First Published | Nov 24, 2024, 8:13 AM IST

UPI ద్వారా చేసే పేమెంట్స్ లిమిట్ ను పెంచుతూ RBI ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు చిన్న చిన్న పేమెంట్స్ కు మాత్రమే UPI 123Pay, UPI Lite వాలెట్లు ఉపయోగిస్తున్నాం కదా.. ఇప్పుడు వీటి లిమిట్ ను పెంచడం వల్ల రూ.వేలల్లో బిల్లులు కూడా సింపుల్ గా కట్టేయొచ్చు. ఇంతకీ RBI ఎంత వరకు UPI లిమిట్స్ పెంచిందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

సాధారణంగా రూ. 200 లోపు కట్టే చిన్న చిన్న పేమెంట్స్ కోసం UPI Lite వాలెట్లు రూపొందించారు. హోటల్స్ కి వెళ్లినప్పుడు, కిరాణా సరకులు కొన్నప్పుడు సింపుల్ మెథడ్ లో పేమెంట్ చేసేందుకు ఈ వాలెట్స్ ఉపయోగపడతాయి. UPI(Unified Payments Interface) వాలెట్స్ ఉపయోగించి పేమెంట్స్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. పిన్ ఎంటర్ చేయక్కరలేదు. ముందుగానే UPI వాలెట్స్ రీఛార్జ్ చేసుకొని పెట్టుకొంటే సరిపోతుంది. ఇంటర్ నెట్ లేకపోయినా పేమెంట్స్ చేసేలా కొన్ని వాలెట్స్ అవకాశం ఇస్తున్నాయి. 

UPI Lite wallets ఉపయోగిస్తే ప్రతి చిన్న అవసరాలకు క్యాష్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చిల్లర సమస్య రాదు. ఇవి రోజువారీ ఖర్చులను సింపుల్ గా చేసేలా చేస్తాయి. వీటి వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. 

ఇప్పుడు UPI లైట్ వాలెట్, లావాదేవీల పరిమితిని పెంచుతూ RBI ప్రకటన చేయడం వల్ల ప్రజలకు పేమెంట్స్ మరింత సులభం కానున్నాయి. UPI 123 Pay పరిమితిని రూ.5,000 నుండి రూ.10,000కి పెంచింది. అదే విధంగా UPI లైట్ వాలెట్ పరిమితిని రూ.2,000 నుండి రూ.5,000కి పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. UPI లైట్ లావాదేవీ లిమిట్ ని రూ.100 నుండి రూ.500కి పెంచారు. 

Latest Videos


ఆర్బీఐ ప్రకటించిన కొత్త రూల్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అయితే బ్యాంకులు, PSBలు, సర్వీస్ ప్రొవైడర్లు వారి పేమెంట్ యాప్స్ కి తగ్గట్టుగా అవసరమైన మార్పులు చేసేందుకు జనవరి 1, 2025 వరకు టైం ఇచ్చారు. UPI 123Payలో ఆన్‌బోర్డింగ్‌కు ఆధార్ OTP మాత్రం తప్పనిసరి చేశారు. 

పేమెంట్స్ సులభతరం చేసేందుకు ఇప్పటికే యూపీఐ అనేక సదుపాయాలు కల్పించింది. యూపీఐ లైట్ ను ఆటో టాప్-అప్ చేసుకోవచ్చు. మీ వాలెట్ లో అమౌంట్ తగ్గుతుంటే వెంటనే టాప్ అప్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. 

యూపీఐ ద్వారా ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా గతంలోనే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏటీఎం కార్డు లేకుండానే సీడీఎం మెషిన్ ద్వారా ఖాతాదారులు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. తమ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం, జమ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. 

వేగవంతమైన లావాదేవీలు, ఆఫ్‌లైన్ చెల్లింపులు, బహుమతులు, 24/7 కస్టమర్ సపోర్ట్ వంటి ఫీచర్లు కొన్ని కంపెనీల యూపీఐ వాలెట్స్ అందిస్తున్నాయి. మీకు నచ్చిన, మీ అవసరాలకు అనుగుణమైన యూపీఐ వాలెట్ ను డౌన్ లోడ్ చేసుకొని ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ చేయాలని RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రజలను కోరారు. కొత్త పరిమితులు UPI లావాదేవీలను మరింత సులభతరం చేస్తాయని అన్నారు. 

click me!