వరస్ట్ హోస్ట్, నాగార్జునపై గౌతమ్‌ ఫ్యాన్స్ ట్రోల్స్.. కన్నడ బ్యాచ్‌ని సేవ్‌ చేస్తున్నాడా?

First Published | Nov 24, 2024, 7:49 AM IST

నాగార్జున ట్రోలర్స్ కి దొరికిపోయాడు. ఆయన్ని గౌతమ్‌ ఫ్యాన్స్ ట్రోల్‌ చేయడం ఆశ్చర్యంగా మారింది. అంతేకాదు వరస్ట్ హోస్ట్ అంటూ చిత్రీకరిస్తున్నారు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ 12 వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తేలిపోతుంది. అయితే ఈవారం యష్మి ఎలిమినేట్‌ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇప్పటి వరకు స్ట్రాంగ్‌ గా నిలిచిన యష్మి ఎలిమినేట్‌ కావడం ఆశ్చర్యమే. కానీ ఆమె డబుల్‌ గేమ్‌, ప్లిప్పింగ్‌ వ్యవహారాలు ఆమెకి బెడిసి కొట్టాయని చెప్పొచ్చు. ఫేక్ ఎమోషన్స్, ఏడుపు సింపతితో గేమ్‌ ఆడుతూ వస్తుందని, తప్పుడు ఆరోపణలు చేస్తుందనే కామెంట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె ఈ వారం ఎలిమినేట్‌ కాబోతుందని టాక్. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున ట్రోలర్స్ కి దొరికిపోయాడు. శనివారం ఎపిసోడ్‌లో ఆయన రియాక్ట్ అయిన తీరు పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కన్నడ బ్యాచ్‌ని కాపాడే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు గ్రూపు లను ఎంకరేజ్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వరస్ట్ హోస్ట్ అంటూ ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

ప్రధానంగా ఇందులో గౌతమ్‌ ఫ్యాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. గౌతమ్‌ని తప్పుగా చిత్రీకరిస్తూ నాగార్జున అతనికి క్లాస్‌ పీకాడు. గ్రూపుగా ఆడుతున్నారు, తనని నామినేట్‌ చేస్తున్నారని, అది తనకు నచ్చలేదని చెప్పాడు గౌతమ్‌. గ్రూపుగా ఆడితే తప్పేంటి? అని నాగార్జున ప్రశ్నించడాన్ని తప్పుబడుతున్నారు. 
 


వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారిని టార్గెట్‌ చేస్తూ పాత వారు ఒక గ్రూపుగా ఫామ్‌ అయిన తమని నామినేట్‌ చేస్తున్నారు, చెబుతున్న కారణాలలో బలం లేదని, తనకు అది నచ్చలేదని గౌతమ్‌ చెప్పగా, గ్రూపుగా ఆడితే తప్పేంటి? అంతకు ముందు నుంచే ఉన్నారు, వాళ్లు ఒక క్లాన్‌గా ఉన్నారు. దీంతో అలానే గేమ్‌ ఆడుతున్నారు, అది వాళ్ల స్ట్రాటజీ అంటాడు నాగ్‌.

బిగ్‌ బాస్‌ షోలో ఆట, నామినేషన్‌ అనేది ఎవరికి వాళ్లు వ్యక్తిగతంగా చేయాల్సింది, ఆడాల్సింది కదా అని వాదించాడు గౌతమ్‌. ఈ క్రమంలో ఓ సందర్భంలో బూతు పదాలు వాడాడని గౌతమ్‌కి క్లాస్‌ పీకాడు నాగ్‌. దీంతో ఆయన ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. నాగ్‌ని టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. 
 

అంతేకాదు కన్నడ బ్యాచ్‌ని నాగార్జున సేవ్‌ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రారంభం నుంచి వారిపై పాజిటివ్‌ కన్సర్న్ చూపిస్తున్నారు నాగార్జున. ఇప్పుడు కూడా వారిని సమర్థిస్తూ విష్ణుప్రియాతోపాటు గౌతమ్‌ని తిట్టడాన్ని నెటిజన్లు మండిపడుతున్నారు. కన్నడ బ్యాచ్‌ విషయంలో ఆడియెన్స్ లోనూ అసహనం ఉంది.

వాళ్లు ఇప్పటికీ గ్రూపుగానే గేమ్‌ ఆడుతున్నారు. అది గమనించకుండా నాగ్‌ స్క్రిప్టెడ్‌గా, షో చూడకుండా తనకు తెలిసింది మాట్లాడుతున్నాడని అంటున్నారు నెటిజన్లు. వరస్ట్ హోస్ట్ అని, ఆయన హోస్టింగ్‌ని తప్పుపడుతున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడిది పెద్ద రచ్చ అవుతుంది. 
 

అయితే ఈ క్రమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గౌతమ్‌కి పాజిటివ్‌ చేస్తున్నారు నాగార్జున. శనివారం ఎపిసోడ్‌లో నాగ్‌ బ్లేమ్‌ చేస్తే గౌతమ్‌కి అది ఆడియెన్స్ నుంచి సింపతిగా మారింది. ఈ ఎపిసోడ్‌లోనే నాగ్ చెప్పారు, ఎవరి ఉద్దేశాలు ఏంటో ఆడియెన్స్ చూస్తారు, దాని బట్టే ఓటు వేస్తారు అని, శనివారం ఎపిసోడ్‌ విషయంలోనూ దాన్ని అమలు చేసి చూపిస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంలో గౌతమ్‌ ఫ్యాన్స్ ముందున్నారు. నాగ్‌ని ఆడుకుంటున్నారు. ఆయన్ని బ్లేమ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 
 

అదే సమయంలో ఈ మొత్తం ప్రాసెస్‌లో జరిగినదంతా గౌతమ్‌ మైలేజ్‌ని పెంచింది. ఆయన మరింత స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మారాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ లెక్కన విన్నర్‌ అవకాశాలు గౌతమ్‌కి పుష్కలంగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

అయితే సోషల్‌ మీడియాలో నిర్వహించిన పోలింగ్‌లో మాత్రం ఇప్పుడు అటు నిఖిల్‌, ఇటు గౌతమ్‌ ల మధ్య హోరా హోరి పోటీ నడుస్తుంది. ఈ ఇద్దరిలోనే ఒకరు ఈ సారి బిగ్‌ బాస్‌ 8 టైటిల్‌ని గెలుస్తారని తెలుస్తుంది. మరి కప్‌ ఎవరికో తెలియాలంటే మరో మూడు వారాలు వెయిట్‌ చేయాల్సిందే. 

read more:`బాహుబలి` డిజాస్టరా? నిర్మాతలకు భారీ నష్టం, కలెక్షన్ల గోల్‌ మాల్‌ వ్యవహారం బయటపెట్టిన సీనియర్‌ ప్రొడ్యూసర్‌

also read:పవన్‌ కళ్యాణ్‌ మూవీ ఆగిపోయిందా? మరో సినిమా కూడా డౌటే? ఫ్యాన్స్ లో ఆందోళన!

Latest Videos

click me!