రజనీకాంత్‌ కంటే బిగ్గర్‌ స్టార్‌ విజయ్ కాంత్‌..? పెద్ద ఎత్తున చర్చ.. పారితోషికం తీసుకోకుండా సినిమాలు..

First Published Dec 28, 2023, 11:37 AM IST

కెప్టెన్‌ విజయ్‌ కాంత్.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ కంటే తోపు అంట. అప్పట్లో బిగ్గర్‌ స్టార్‌గా రాణించారు. అంతేకాదు పారితోషికం కూడా తీసుకోకుండా సినిమాలు చేశారట. 
 

కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ అనారోగ్యంతో ఇన్నాళ్లు పోరాడి, చివరికి కరోనా కారణంగా గురువారం కన్నుమూశారు. ఆయన మరణంతో యావత్‌ ఇండియన్‌ సినిమా దిగ్భ్రాంతికి గురవుతుంది. సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్‌ కాంత్‌ మరణం సందర్భంగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఒకప్పుడు విజయ్‌ కాంత్‌.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కంటే పెద్ద స్టార్‌ అనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 
 

విజయ్‌ కాంత్‌ నాలుగు దశాబ్దాల కెరీర్‌లో సుమారు 160 సినిమాల్లో నటించారు. తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమని శాషించారు. ఎంజీఆర్‌ తర్వాత అంతటి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. శివాజీ గణేషన్‌, జెమినీ గణేషన్‌, కమల్‌, రజనీల రేంజ్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా సినిమాలు, స్టార్‌ ఇమేజ్‌, మార్కెట్‌, హ్యూమానిటీ విషయంలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ పోలీస్‌ రోల్స్ చేసిన హీరోగానూ నిలిచారు. ఆయన దాదాపు 20కిపైగా చిత్రాల్లో పోలీస్‌ పాత్రలు చేశారు. ఆ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు.
 

Latest Videos


అయితే విజయ్‌ కాంత్‌.. రజనీకాంత్‌ని మించిన స్టార్‌ అనే చర్చ కూడా కోలీవుడ్‌లో నడిచింది. హీరోగా కెరీర్‌ని ప్రారంభించిన ప్రారంభం(1980)లోనే హీరోగా మంచి పేరుతెచ్చుకున్నాడు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో రజనీకాంత్‌ అప్పటికే నటుడిగా సినిమాలు చేస్తున్నారు. కొన్ని హీరోగా, మరికొన్ని క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా చేశారు. ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో, సెకండ్‌ లీడ్‌గానూ మెరిశారు. కానీ విజయ్ కాంత్‌ మాత్రం చాలా వరకు సోలో హీరోగానే చేశారట. అయితే అప్పట్లో విజయ్‌ కాంత్‌ ఏడాదికి 18 సినిమాలు రిలీజ్‌ చేసిన రోజులున్నాయి. 
 

విజయ్ కాంత్‌ తన 27ఏళ్ల వయసులోనే సినిమా అరంగేట్రం చేశాడు. 1979లో `ఇనిక్కుమ్‌ ఇలమై` సినిమాలో విలన్‌గా నటించారు. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. అప్పట్లో మూడు షిఫ్ట్ ల్లో సినిమాలు చేశారు. 1984లో ఆయన 18 సినిమాల్లో నటించారు. అందులో చాలా వరకు విజయం సాధించాయి. ఆ సమయంలో తమిళంలోనే టాప్‌ స్టార్‌గా వెలుగొందాడట విజయ్‌ కాంత్. రజనీకాంత్‌, కమల్‌ లను మించిపోయాడని, అంతేకాదు శివాజీ గణేషన్‌, జెమినీ గణేషన్‌లను మించిన స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందట. ఎంజీఆర్‌ తర్వాత ఆయనే సూపర్‌ స్టార్‌ అనేంతటి చర్చ కూడా జరిగిందట. 
 

1985లో ఆయన 15 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అదే ఇమేజ్‌ని ఆయన కంటిన్యూ చేశాడు. అయితే విజయ్‌ కాంత్‌ సినిమాలు డివైడ్‌ టాక్ వచ్చినా, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లని సాధించేవట. నిర్మాతలకు మినిమమ్‌ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. దీనికి కారణం ఆయన తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయడం. అది నిర్మాతలకు ఎంతో సేఫ్‌గా ఉండేదట. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టేవారని అంటుంటారు.
 

ఆ సమయంలో మార్కెట్‌ పరంగా, సినిమాల కలెక్షన్ల పరంగా విజయ్‌ కాంత్‌.. రజనీకాంత్‌ కంటే తోపు అంటుంటారు. రజనీ ఆసమయంలో తక్కువ సినిమాలు చేశారు. అలా రజనీని మించిపోయాడు విజయ్‌ కాంత్‌. విజయ్ కాంత్‌ కి దేశభక్తి ఎక్కువ. ఆయన సినిమాల్లో చాలా వరకు దేశభక్తి, సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, డ్యూయెల్‌ రోల్‌ చేయాల్సి వచ్చినా విజయ్‌ కాంత్ ముందుండేవారు. రజనీకాంత్‌ కంటే పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించేవారు. అలా కూడా విజయ్‌ కాంత్‌ చాలా ఫేమస్‌ అయ్యారు. 

అంతేకాదు హ్యూమానిటీని చాటుకునే వారు విజయ్‌ కాంత్‌. ఇతర హీరోల్లా పారితోషికం ముందుగా తీసుకునేవారు కాదు. సినిమా ఫలితం తర్వాతనే తీసుకునే వారట. అలా నిర్మాతలకు సపోర్ట్ గా నిలిచే వారట. అంతేకాదు తనతో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులో ఉంటే వారి నుంచి పారితోషికం తీసుకునే వారు కాదట. చాలా వరకు తక్కువ పారితోషికం తీసుకునేవారు. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపేవారని సమాచారం. కానీ ఆ తర్వాత తర్వాత.. విజయ్ కాంత్‌ క్రేజ్‌ తగ్గింది. రజనీ స్టయిల్, మ్యానరిజం జనాలకు బాగా ఎక్కింది. దీంతో తిరుగులేని సూపర్‌ స్టార్ గా ఎదిగారు. 
 

click me!