దీపావళి పండుగ సందర్భంగా అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ గురించి Ola Electric ప్రత్యేక ప్రకటన చేసింది. అన్ని రకాల కస్టమర్లకు రూ.5,000 డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన కొందరు కస్టమర్లకు రూ.25,000 వరకు అదనపు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఇది స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమేనని, ధరలో మార్పు కాదని నొక్కి చెప్పింది.