సింగపూర్ నుంచి అపోలో వరకు.. గతంలో రజనీకాంత్‌ కు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ జరిగిందో తెలుసా..?

By Mahesh JujjuriFirst Published Oct 3, 2024, 7:34 PM IST
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్యంతో బాధపడ్డారు. గతంలో కూడా ఆయన అనేకసార్లు ఆసుపత్రుల్లో చేరారు. సింగపూర్ నుండి చెన్నై వరకు, ఆయన ఆరోగ్య సమస్యలకు ఎక్కడెక్కడ చికిత్స తీసుకున్నారో తెలుసుకుందాం.

రీసెంట్ గా అపోలో హాస్పిటల్ లో చేరారు. ఆయనకు హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. అయితే అనారోగ్య సమస్యతో రజినీకాంత్ హాస్పిటల్ లో చేరడం ఇది మొదటి సారి కాదు.. గతంలో ఆయనకు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్లు జరిగాయో తెలుసా..? 


తమిళ సూపర్ స్టార్.. సౌత్ ఇండియన్ స్టార్ హీరో రజినీకాంత్ రీసెంట్ గా తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. రాత్రికి రాత్రి చెన్నైలోని అయర్ లాంపు ప్రాంతంలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. జీర్ణకోశ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు రక్తనాళాలకు సబంధించిన టెస్ట్ చేశారు. అంతే కాదు రజనీకాంత్ కు హార్ట్ ఆపరేషన్ కూడా చేశారు. 

Latest Videos

ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన అభిమానులు సూపర్ స్టార్ ఆరోగ్యంపై ఆందోళన చేందగా.. రజినీకాంత్ భార్య లత ఈ ప్రకటన చేశారు. దాంతో ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. ఇక రజినీకాంత్ ఆరోగ్యంపై దేశ వ్యాప్తంగా పలువురు ఆయన్ను పరామర్శించడంతో పాటు.. ప్రధాని మోదీ కూడా సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. 

ఇక రజనీకాంత కు ఇలా సడెన్ గా అనారోగ్యం రావడం.. ఇది మొదటి సారి కాదు.. చాలా సార్లు ఆయన హాస్పిటల్స్ లో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు. ఇంతకు ముందు సూపర్ స్టార్ ఎక్కడెక్కడ ట్రీట్మెంట్లు తీసుకున్నారంటే..? 


2011 నుంచి 2024 వరకు రజినీకాంత్ ట్రీట్మెంట్స్ :

సూపర్ స్టార్   రజనీకాంత్ తీవ్ర అనారోగ్య కారణాలతో 2011లో చికిత్స నిమిత్తం చెన్నైలోని పోరూర్‌లోని రామచంద్ర ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పుడు ఆయన  డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు  డాక్టర్లు గుర్తించి ట్రీట్మెంట్ అందించారు. 


ఇక రజినీకాంత్ కు కిడ్నీ ప్రాబ్లమ్ రావడంతో..  ఆయన పరిస్థితి విషమించింది ఇక వెంటనే రజనీకాంత్ ను   సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి కిడ్నీ మార్పిడి చేశారు. ఆ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సింగపూర్ ఆసుపత్రిలో నెల రోజులకు పైగా చికిత్సతీసుకున్నారు. అప్పుడు అభిమానులు చాలా ఆందోళన చెందారు. పూజలు ప్రార్ధనలతో సూపర్ స్టార్ ఆరోగ్యంగా రావాలని కోరకున్నారు. 

ఇక 2020లో కూడా రజినీకాంత్ సడెన్ గా అనారోగ్యంపాలు అయ్యారు. అది కూడా హైదరాబాద్ లో షూటింగ్ లో ఉండగా కరోనా మహమ్మారి సమయంలో రజనీకాంత్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అన్నాత్తే సినిమా షూటింగ్‌లో ఉన్న రజనీకాంత్‌కి.. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది.  కరోనా  వచ్చిందేమో అనుకుని తనను తాను ఐసోలేట్ చేసుకున్నారు రజినీకాంత్. 

ఇక వెంటనే  ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించడం.. కరోనాకు సంబంధించిన రకరకాల పరీక్షలు చేయడంతో.. కరోనా లేదని తేలింది. అయితే ఆయనకు .  ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉందని తేల్చారు. దాంతో హైదరాబాద్ అపోలోలో రజినీకాంత్  కొన్ని రోజులు చికిత్స పొంది ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. 

2021లో కూడా రజనీకాంత్ కు అనారోగ్యం తిరగబెట్టింది.  నరాల దెబ్బతినడంతో చికిత్స కోసం చెన్నైలోని అల్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రిలో సూపర్ స్టార్ చేరారు. దాదాపు 4 రోజులకు పైగా అక్కడే ఉండి వివిధ చికిత్సల అనంతరం ఇంటికి చేరుకున్నాడు.

ఇక రీసెంట్ గా సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి, నటుడు రజనీకాంత్ తేలికపాటి ఛాతీ నొప్పి, అలసట మరియు పొత్తికడుపు వాపు కారణంగా చెన్నైలోని అయర్ లాన్‌ముట్ ప్రాంతంలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు కార్డియాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు రజినీకాంత్ కోలుకుంటున్నారు. 


రజినీకాంత్ కు స్టెంట్ వేసిన డాక్టర్లు

 గుండె నుండి శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్త నాళంలో(aorta)వాపు చోటు చేసుకుంది. శస్త్ర చికిత్స అవసరం లేకుండా ట్రాన్స్ క్యాథటర్ పద్దతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ ఆర్టా కి స్టెంట్ అమర్చారు. రజినీకాంత్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు.. 

73ఏళ్ల రజినీకాంత్  అనారోగ్యం  కారణంగానే రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. త్వరలో పార్టీ ప్రకటన చేస్తారనగా.. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అభిమానులు ఇంటి ముందు ధర్నాలు చేసినా... ఆయన డెసిషన్ మారలేదు. ఆ మధ్య రజినీకాంత్ అమెరికాలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్నారు. 

ప్రస్తుతం ఆయన వేట్టయాన్‌, కూలీ చిత్రాల్లో నటిస్తున్నారు. వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న విడుదల కానుంది. దసరా కానుకగా బాక్సాఫీసు ముందుకొస్తున్న చిత్రాల్లో ‘వేట్టయాన్‌’ ఒకటి. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు  పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది.  టి.జె. జ్ఞానవేల్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది రజనీకాంత్‌కు 170వ చిత్రం. ఆయన ఇందులో రిటైర్డ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్టు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, మంజు వారియర్‌,  కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానుంది. 


 

click me!