బిగ్ బాస్ తెలుగు 8 లో.. వితికా షేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్, ఒంటరిగానా, మరి జంటగానా..?

By Mahesh JujjuriFirst Published Oct 3, 2024, 10:25 PM IST
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి చాలా రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. ఈ సీజన్‌లోకి వితికా షేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి చాలా రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. ఈ విషయంలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లిమిట్ లెస్ ట్విస్ట్ లు అంటూ.. ముందే చెపితే.. పెద్దగా ఏముంటాయిలే అనుకున్నారు అంతా. కాని అందుకు తగ్గట్టుగానే లిమిట్ లెస్ ఫన్ తో పాటు..లిమిట్ లెస్ గొడవలు, ఎమోషన్స్, టాస్క్ లు.. ఇప్పుడు లిమిట్ లెస్ వైల్ కార్డ్ సర్ ప్రైజ్ ను కూడా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. అటు బిగ్ బాస్ ఇంట్లో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను తగ్గించడానికి వారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. భయంకరంగా ఆట ఆడేస్తున్నారు. కాని బిగ్ బాస్ మాత్రం పక్కా ప్లాన్ తో ఉన్నాడు  దాదాపు 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఎలాగైనా పంపించడానికి రంగం సిద్ధం చేసినట్టుతెలుస్తోంది. 

Latest Videos

అయితే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్న క్రమంలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం ఫిక్స్ అయ్యిందని సమాచారం. పక్కాగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న వైల్డ్ కార్డ్  ఎంట్రీ ఎవరో కాదు వితికా షేరు. అవును బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో తన భర్త.. హీరో  వరుణ్ సందేష్ తో కలిసి సందడి చేసింది వితిక. ఇద్దరు కలిసి అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. అయితే ఇక ఇన్నేళ్ళకు.. సీజన్ 8 లో  వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. 

బిగ్ బాస్ ప్లాన్ మామూలుగా లేదు. వైల్డ్ కార్డ్స్ ను చాలా పక్కాగా ప్లాన్ చేశాడు. 8 వైల్డ్ కార్డ్స్  అది కూడా కొత్త ముఖాలను తీసుకువస్తే జనాలు చూస్తారో చూడరో అని అభిప్రాయంతో... జరిగిపోయిన 7 సీజన్స్ కు సబంధించిన టాప్ కంటెస్టెంట్స్ ను రంగంలోకి దించబోతున్నారు. ఈ లిస్ట్ లో ముక్కు అవినాష్ తో పాటు రోహిణి, దిల్ సే మెహబూబ్. నయనీ పావని, హరితేజ,  తేజ, గంగవ్వ ఇలా వీరి పేర్లు వినిపించాయి. అయితే గంగవ్వ అనారోగ్యం కారణంగా వెనకడుగు వేయడంతో.. ఆమె ప్లేస్ లోకి వితికా షేరు వచ్చి చేరినట్టు తెలుస్తోంది. 

అయితే బిగ్ బాస్ ఆటను రసవత్తరంగా మార్చుతున్నాడు. ఇఫ్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నవారు.. ఈ ఐదు వారాలు ఆటలో ఆరితేరారు. ఇక వచ్చేవారు కూడా ఇంతకు ముందు ఆటలో అనుభవం ఉన్నవారు. దాంతో వీరంతా రెండు గ్రూప్ లు గా మారే అవకాశం ఉంది. పోటా పోటీగా టాస్క్ లు , గొడవలు, ఇక హౌస్ అంతా రచ్చ రచ్చ జరగబోతున్నట్టు అనిపిస్తుంది. సో ఏం జరుగుతుందో చూడాలి అయితే వీరంతా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో తెలియదు కాని.. వైల్డ్ కార్డ్ ద్వారా వితిక షేరు త్వరలోనే హౌస్ లో అడుగు పెట్టబోతున్నట్టు మాత్రం తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుంది. 

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా ముందు దూసుకుపోతున్నారు. మణికంఠ, నిఖిల్, పృధ్వి, నబిల్ వీరు టాప్ లో  ఉన్నారు.. పక్కా స్ట్రాటజీతో ఆడుతున్నారు మిగతావారికంటే వీరు ముందు ఉన్నారు. మరి వైల్డ్ కార్డ్ లు ఎంట్రీ తరువాత పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. 

click me!