ఒక పబ్, వైన్ షాప్, రేంజ్ రోవర్ కారు.. దేవుడా వేణు స్వామి ఇంత పెద్ద కోటీశ్వరుడా, భార్య మీద ప్రేమతో కసిగా

First Published Jan 5, 2024, 2:54 PM IST

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. వేణు స్వామి చేసే వ్యాఖ్యలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.

Venu swamy

కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం వివాదంగా మారడం చూస్తూనే ఉన్నాం. బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇక కెరీర్ ఉండదని గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే సలార్ హిట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేశారు. 

Latest Videos


రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయతి లాంటి హీరోయిన్లు కూడా వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకున్నారు. వేణు స్వామి చెప్పే జాతకాలని చాలా మంది సెలెబ్రిటీలు నమ్ముతారు. ఉన్న విషయాన్ని ఉన్నట్లు ఖరాకండిగా చెబుతూ చాలా బోల్డ్ గా కామెంట్స్ చేయడంతో వేణు స్వామి కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందేశారు. 

వేణు స్వామి చెప్పే జాతకాలని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. వేణు స్వామికి నిజంగానే అంత బాగా జాతకాలు తెలిస్తే తనని తాను బాగు చేసుకోవచ్చు కదా.. ఎందుకు జాతకాలు చెప్పుకుంటున్నారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రశ్నలకు వేణు స్వామి తాజాగా ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వేణు స్వామి తొలిసారి తన ఆస్తుల చిట్టా విప్పారు. 

Venu Swami

వేణు స్వామి చెప్పిన విషయాలు గమనిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఆయన అంత పెద్ద కోటేశ్వరుడా అని ఆశ్చర్యపోతారు. వేణు స్వామి మాట్లాడుతూ.. నాకు జాతకం చెప్పడం ద్వారా మాత్రమే డబ్బులు రావు. సినిమా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు నా దగ్గరకి వస్తారు. సామాన్య జనాలకు కూడా టైం కేటాయిస్తున్నా. ఇవి కాకుండా నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. 

నాకు ఒక పబ్, ఒక వైన్ షాప్, రేంజ్ రోవర్ కారు.. ఇంకా ఇతర వ్యాపారాలు ఉన్నట్లు వేణు స్వామి షాకిచ్చారు. జ్యోతిష్యం చెప్పే వాడి జాతకం బావుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగే వారికి నా సంపాదనే సమాధానం. నా రేంజ్ ఇది అని వేణు స్వామి అన్నారు. నాతో పాటు నా భార్య కూడా సంపాదిస్తుంది. ఆమె సంగీతంలో ప్రావీణ్యురాలు అనే సంగతి తెలిసిందే. 

ఎవరైనా భార్య మీద ప్రేమతో కసిగా సంపాదిస్తారు. తాను కూడా తన భార్య వీణా శ్రీవాణిపై ప్రేమతో ఇంత సంపాదించినట్లు వేణు స్వామి ఫన్నీగా అన్నారు. ప్రతి నెల తాను జీఎస్టీ ట్యాక్సులు కూడా కడుతున్నట్లు వేణు స్వామి అన్నారు. 

click me!