త్రివిక్రమ్‌ చేతిలో ఆరుగురు స్టార్‌ హీరోలు.. ఫ్లాప్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌.. మాటల మాంత్రికుడి టార్గెట్ ఎవరు?

Published : Jan 25, 2024, 04:31 PM ISTUpdated : Jan 25, 2024, 05:36 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఇటీవల `గుంటూరు కారం` చిత్రంతో వచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ ఇప్పుడు ఆయన చుట్టూ ఆరుగు స్టార్‌ హీరోలు పోటీలో ఉండటం విశేషం.   

PREV
17
త్రివిక్రమ్‌ చేతిలో ఆరుగురు స్టార్‌ హీరోలు.. ఫ్లాప్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌.. మాటల మాంత్రికుడి టార్గెట్ ఎవరు?

త్రివిక్రమ్‌ అంటే తుటాల్లాంటి మాటలకు కేరాఫ్‌ అంటారు. ఎమోషన్స్, బంధాలు, అనుబంధాలు, మేళవింపుతో ఆయన రైటింగ్ సాగుతుంది. వాటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ `గుంటూరు కారం` సినిమా విషయంలో ఆయన ఫెయిల్‌ అయ్యారని అంటున్నారు. ఆయన రేంజ్‌ రైటింగ్‌ కనిపించలేదనే కామెంట్‌ వినిపించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఓ రకంగా ఫెయిల్యూర్‌ మూవీ అనే చెప్పాలి. 

27

అయితే సినిమా పోతే దర్శకుడికి నెక్ట్స్ సినిమాలు ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి. వారి కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారిపోయింది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్‌ పరిస్థితి మాత్రం రివర్స్. ఆయనకు ఇలాంటి పరిస్థితిలో కూడా తనే సెలక్ట్ చేసుకునే స్థితిలో ఉన్నారు. ఆయన చేతిలో ఏకంగా ఆరుగురు స్టార్‌ హీరోలు ఉండటం విశేషం. మరి ఆ హీరోలెవరు, ఆ లెక్కేంటో చూస్తే.. 
 

37

త్రివిక్రమ్‌ తన నెక్ట్స్ సినిమాని అల్లు అర్జున్‌తో ప్రకటించారు. కానీ బన్నీ ప్రస్తుతం `పుష్ప2`లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తవడానికి ఇంకా టైమ్‌ పడుతుంది. ఈ మూవీ డిసెంబర్‌కి వెళ్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే, ఈ కాంబినేషన్‌ సెట్‌ కావడానికి చాలా టైమ్‌ పడుతుంది. సో ఇమ్మీడియెట్ గా బన్నీ మూవీ ఉండబోదు. 

47

మరోవైపు ఎన్టీఆర్‌తో ఓ కమిట్‌మెంట్‌ ఉంది. అధికారికంగా ప్రకటించి, క్యాన్సిల్‌ చేసుకున్నారు. కానీ ఓ భారీ సినిమా మాత్రం ఉంటుందట. ఇటీవల నాగవంశీ కూడా చెప్పారు. చాలా లార్జ్ స్కేల్‌లో దీన్ని తీయాలనుకుంటున్నారు. ప్రస్తుతం తారక్‌ `దేవర`లో నటిస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తి కానుంది. కుదిరితే త్రివిక్రమ్‌ వెంటనే తారక్‌తో చేయబోతున్నారని తెలుస్తుంది. 
 

57

వెంకటేష్‌, నాని కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ మూవీ చేయబోతున్నారట. చాలా రోజులుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీతో త్రివిక్రమ్‌ కమిట్‌మెంట్ ఉంది. అది కూడా క్యాన్సిల్‌ అయ్యింది. కానీ ఇప్పుడు పట్టాలెక్కిస్తారట. ఇందులో నాని మరో హీరోగా నటిస్తారని, ఇది మల్టీస్టారర్‌గా రాబోతుందని అంటున్నారు. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్‌ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్‌ చేతిలోనే వెంకీ, నాని ఉన్నారని చెప్పొచ్చు. 

67

విజయ్‌ దేవరకొండ సైతం త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ని వెల్లడించారు. త్రివిక్రమ్‌ చేసేందుకు సిద్దంగా ఉంటే, విజయ్‌ మాత్రం రెడీగా ఉన్నారట. ప్రస్తుతం విజయ్‌ `ఫ్యామిలీ స్టార్‌` చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరితో సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. త్రివిక్రమ్‌ ఓకే అయితే ఈ రెండు సినిమాలను విజయ్‌ ఏక కాలంలో చేసే అవకాశం ఉంది. 

77

ఇంకోవైపు రామ్‌ పోతినేని కూడా మాటల మాంత్రికుడితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన `డబుల్ ఇస్మార్ట్` చిత్రంలో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే త్రివిక్రమ్‌ రామ్‌ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు రామ్‌ పెదనాన్న రవికిషోర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. చాలా కాలంగానే ఈ ప్రయత్నం జరుగుతుంది. దీంతో మాటల మాంత్రికుడి చేతిలో ఇప్పుడు రామ్‌ కూడా ఉన్నారు. ఇలా త్రివిక్రమ్‌కి ఆరుగురు హీరోలు రెడీగా ఉన్నారు. మరి ఆయన ఎవరితో వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఎన్టీఆర్‌తో చేసే అవకాశం ఉందని వినిపిస్తుంది. ఏం జరుగుతుందో మున్ముందు తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories