Ennenno Janmala Bandham: కయ్యానికి కాలు దువ్వుతున్న మాళవిక.. కోపంతో ఛాలెంజ్ చేసిన వేద!

First Published Apr 25, 2023, 11:20 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భార్యని అపార్థం చేసుకున్నందుకు ప్రశ్చ్యాతాపంతో కుమిలిపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో యష్ గేమ్ లో 20 అవుట్ ఆఫ్ 20 సాధిస్తాడు. మీరు గ్రేట్ అండి నేనైనా ఒక పాయింట్ తక్కువ సాధించాను, మీరు మాత్రం పూర్తీ స్కోరు సాధించారు అంటూ భర్తని మెచ్చుకుంటుంది. అప్పుడే మాళవిక కూడా అక్కడికి వస్తుంది. కానీ ఒకరిని ఒకరు చూసుకోరు. మరోవైపు భార్య కళ్ళలోకి చూడటానికి ఇబ్బంది పడతాడు యష్. అదే ప్రశ్నిస్తుంది వేద. అతని చేతి మీద చేయి వేసి మీరు నోటితో చెప్పలేని మీ భావాలు మీ టచ్ తో నాకు అర్థం అవుతున్నాయి. నన్ను, ఖుషీని వదిలి వెళ్లాలని మీకు లేదు కదా అంటుంది వేద.

నీ భవిష్యత్తు బాగోవాలంటే వెళ్లక తప్పదు అనుకుంటాడు యష్. ఆలోచనలో ఉన్న భర్తని చూసి.. అంత ఫీల్ అవుతున్నారు, వదల లేక, వదల లేక వెళ్ళటం అవసరమా? ఎవరినైనా పంపించవచ్చు కదా. అసలు వెళ్ళకుండానే ఉండొచ్చు కదా, నాకోసం అంటూ చేయి పట్టుకొని బ్రతిమాలుతుంది వేద. నేను ఏం చేసినా నీకోసమే చేస్తాను. ఇప్పుడు వెళ్ళేది కూడా నీకోసమే. ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కానీ రాను రాను అలవాటవుతుంది అంటాడు యష్. పేపర్ మీద ఏదో రాసి సింగర్ కి ఇస్తుంది వేద. అది చదివిన సింగర్ థిస్ బ్యూటిఫుల్ సాంగ్ డెడికేటెడ్ టు మిస్టర్ యశోదర్ అనటంతో మాళవిక తలెత్తి చూస్తుంది.
 

Latest Videos


యష్, వేద ఇద్దరూ డాన్స్ చేస్తారు. అక్కడున్న అందరూ వీళ్ళిద్దరిని అప్రిషియేట్  చేస్తారు. మీరు కూర్చోండి నేను ఇప్పుడే వాష్ రూమ్ కి వెళ్లి వస్తాను అని చెప్పి బయలుదేరుతుంది వేద. దారిలో చూసుకోకుండా వేద, మాళవిక ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు. కళ్ళు కనిపించడం లేదా అని ఇద్దరు తిట్టుకుంటారు. సడన్ గా వేద కి కంగ్రాట్స్ చెప్తుంది మాళవిక. అయోమయంగా చూస్తుంది వేద. నీ మొగుడు నిన్ను వదిలేసి అమెరికా షిఫ్ట్ అయిపోతున్నాడంట కదా అని అంటుంది మాళవిక. షిఫ్ట్ అయిపోవటం లేదు మళ్లీ పది రోజుల్లో తిరిగి వచ్చేస్తారు నువ్వేమీ కుళ్ళుకో అక్కర్లేదు అంటుంది వేద. 

 దేన్ని చూసి కుళ్ళు కోవాలి, నువ్వు ప్రాణంగా చూసుకుంటున్నది నా కూతుర్ని, నేను వదిలేసిన మొగుడుతో అడ్జస్ట్మెంట్ కాపురం చేస్తున్నావు నువ్వు. అలాంటి నిన్ను చూసి కుళ్ళుకోవాలా అంటూ హేళనగా మాట్లాడుతుంది మాళవిక. అడ్జస్ట్మెంట్ మొగుడు కాదు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మొగుడు కావాలంటే ఇక్కడ నుంచి వెళ్లే లోపు నా భర్త చేత నేను ఐ లవ్ యు చెప్పిస్తాను చూడు అంటూ మాళవికతో చాలెంజ్ చేస్తుంది వేద. మరోవైపు యష్ దంపతులని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేస్తారు  హోటల్ మేనేజ్మెంట్.

మాతో పాటు అటెండ్ అవ్వండని యష్ దంపతులని ఇన్వైట్ చేస్తారు. అందరూ ఆ ఈవెంట్ దగ్గరికి చేరుకుంటారు. మాళవిక, యష్ దగ్గరికి వచ్చి పది రోజులు అమెరికా వెళ్లి వస్తున్నావంట కదా అంటుంది. యష్ ఏమి మాట్లాడకపోవటంతో నాతో కాపురం చేసే రోజుల్లో పది నిమిషాలు కూడా వదిలేసి ఉండలేకపోయే వాడివి ఇప్పుడు ఎలా పది రోజులు అమెరికా వెళుతున్నావు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మాళవిక.

మాళవికని కోప్పడతాడు యష్. నీ జీవితాన్ని చేజేతులా నువ్వు పాడు చేసుకున్నది ఎంత నిజమో, ఎన్ని అవంతరాలు వచ్చినా నా కాపురాన్ని నేను నిలబెట్టుకుంటాను అన్నది కూడా అంతే నిజం అంటూ కోపంగా మాట్లాడుతుంది వేద. ఇంతలో హోటల్ స్టాఫ్ ఒకావిడ వచ్చి మీ దంపతులకు లాస్ట్ టాస్క్ ఇది ఇందులో కూడా మీరు గెలవాలి, ఇంతకీ టాస్క్ ఏంటంటే యశోదర్ గారి కళ్ళకి గంతలు కడతాము.

 ఆయన ఇక్కడున్న ఆడవాళ్ళందరిలో తన భార్యను కనిపెట్టాలి అంటుంది. వేద చేతికి క్లాత్ ఇచ్చి యశోదర్ గారి కళ్ళకి గంతలు కట్టమంటుంది లేడీ స్టాఫ్. వేద అలాగే చేస్తుంది. కళ్లకు గంతలు కట్టుకున్న యష్  ముందు మాళవిక దగ్గరికి వెళ్తాడు కానీ ఆమెని టచ్ చేయకుండా పక్కనే ఉన్న వేదని టచ్ చేస్తాడు. ఈ గేమ్ లో కూడా గెలవడంతో అందరూ అప్రిషియేట్ చేస్తారు.వేద, యష్ ని హత్తుకుంటుంది. ఈర్షతో రగిలిపోతుంది మాళవిక. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!