సూపర్ స్టార్‌ ఇండస్ట్రీకి గుడ్‌ బై.. రోడ్డుపైకి స్టార్‌ యాంకర్‌ పర్సనల్‌ లైఫ్‌.. వేణు స్వామి సంచలన జ్యోతిష్యం

First Published Jan 1, 2024, 9:58 PM IST

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా చెలామణి అవుతున్న వేణు స్వామి కొత్త ఏడాది సందర్భంగా సంచలన జ్యోతిష్యం చెప్పాడు. స్టార్‌ హీరో, స్టార్‌ యాంకర్‌ జీవితాలపై హాట్‌ కామెంట్‌ చేశాడు. 
 

 ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పాపులర్‌ అయ్యాడు వేణు స్వామి. ఆయన చెప్పింది దాదాపు నిజం అవుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. న్యూ ఇయర్‌ సందర్భంగా ఆయన జ్యోతిష్యం చెప్పాడు. కొత్త ఏడాది ఎలా ఉండబోతుంది, చిత్రపరిశ్రమలో చోటు చేసుకునే పరిణామాలను ఆయన వెల్లడించారు. ఇందులో షాకింగ్‌ విషయాలను వేణుస్వామి పంచుకున్నారు. 

ప్రధానంగా ఓ సూపర్ స్టార్‌ గురించి చెప్పి షాకిచ్చాడు వేణుస్వామి. ఈ ఏడాది ఓ సూపర్‌ స్టార్‌ చిత్ర పరిశ్రమ నుంచి నిష్రమిస్తాడని చెప్పాడు. అనారోగ్య కారణాలతో ఆయన ఇండస్ట్రీకి గుడ్‌ బై చెబుతాడని, సినిమాలు మానేస్తాడని తెలిపారు.  ఈ ఏడాది గానీ, లేదంటే వచ్చే ఏడాదిగానీ ఆయన ఇండస్ట్రీని వీడుతాడని తెలిపారు. అయితే ఆ సూపర్‌ స్టార్‌ ఎవరో ఆయన చెప్పలేదు. ఈ విషయంలో కాస్త సేఫ్‌ గేమ్‌ ఆడాడు వేణుస్వామి. 
 

Latest Videos


మరోవైపు ఓ స్టార్‌ యాంకర్‌పై కూడా ఆయన షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్‌ యాంకర్‌ వ్యక్తిగత జీవితం బట్టబయలు అవుతుందని, రోడ్డున పడ్డ పరిస్థితి అవుతుందన్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్ని బాధలు పడుతుందో, ఎంతటి నరకం అనుభవిస్తుందో బయటి ప్రపంచానికి తెలుస్తుందని, ఇది అందరిని ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఆమె పరిస్థితిని చూసి జాలి చూపిస్తారని వెల్లడించారు. 

అంతేకాదు బాలీవుడ్‌ హీరోయిన్‌పై కూడా హాట్‌ కామెంట్‌ చేశాడు వేణు స్వామి. బాలీవుడ్‌ హీరోయిన్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ సంచలన విషయం బయటకు వస్తుందని, ఆమె సంచలనాలకు కేరాఫ్‌గా మారుతుందన్నారు. అంతేకాదు ఉగాది నుంచి పరిస్థితులను వేణు స్వామి తెలిపారు. వచ్చేడాది క్రోధి నామ సంవత్సరం అని, ఈ ఏడాదికి కుజుడు రాజుగా ఉంటాడని, మంత్రి స్థానంలో శని ఉంటాడని, కుజుడు చేడు ప్రభావాలను చూపిస్తాడని, శని కూడా చెడు ప్రభావాలను కలిగిస్తాడని, మొత్తంగా వచ్చే ఏడాది మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. 

కరోనా తరహాలో మరో మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుందని, రోగం లాంటి ఉపద్రవం మరోసారి రానుందని చెప్పారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వస్తుందని, కాకపోతే ఇండియాకి ఆ ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని చెప్పాడు. దీంతోపాటు రాజకీయాలపై కూడా ఆయన హాట్‌ కామెంట్‌ చేశాడు. గతంలో ప్రభాస్‌ పెళ్లిపై, ఆయన సినిమాల సక్సెస్‌ పై కూడా కామెంట్‌ చేశారు. అవి వైరల్‌ అయ్యాయి. చాలా వరకు దగ్గరగా జరిగాయి. దీంతో ఇప్పుడు వేణు స్వామి వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

click me!