బిగ్ బాస్ హౌస్ లో శృంగార కోరికలు ఎలా ఆపుకుంటారు.. యాంకర్ ప్రశ్నకు శివాజీ సమాధానం

First Published Jan 18, 2024, 6:03 PM IST

శివాజీని నుంచి ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ కి సంబంధించిన పూర్తి సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. శివాజీ కూడా ఎలాంటి ప్రశ్నకు వెనుకాడడం లేదు. అన్ని ప్రశ్నలకు ధైర్యంగా బదులిస్తున్నారు.

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో సీజన్ 7 సంచలనంగా నిలిచింది. ఊహించని విధంగా సామాన్య రైతు బిడ్డ విజేతగా నిలవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అరెస్ట్ కావడం లాంటి సంఘటనలు సీజన్ 7 లోనే జరిగాయి. విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్, నటుడు శివాజీ, బుల్లితెర నటుడు అమర్ దీప్, శోభా శెట్టి లాంటి వారు ఈ సీజన్ లో హైలైట్ అయ్యారు. 

బిగ్ బాస్ ముగిసిన తర్వాత హీరో శివాజీకి ఊహించని పబ్లిసిటీ లభించింది. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడం వెనుక కారణం శివాజీనే అంటూ కూడా ప్రశంసలు దక్కాయి. శివాజీ ఇప్పటికి వరుసగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాను నటించిన 90's మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ ని కూడా రిలీజ్ చేశారు. 

Latest Videos


Bigg Boss Telugu 7

అయితే శివాజీని నుంచి ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ కి సంబంధించిన పూర్తి సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. శివాజీ కూడా ఎలాంటి ప్రశ్నకు వెనుకాడడం లేదు. అన్ని ప్రశ్నలకు ధైర్యంగా బదులిస్తున్నారు. ఈ క్రమంలో శివాజీ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. 

ఓ ఇంటర్వ్యూలో యాంకర్ శివాజీని ప్రశ్నిస్తూ.. బిగ్ బాస్ లోకి యుక్తవయసు ఉన్నవారు లేదా అంతకంటే పెద్ద వారు వెళుతుంటారు. ఆడ మగా అంతా కలసి ఒకే చోట ఉంటారు.. తింటారు.. పడుకుంటారు. దాదాపు మూడు నెలల పాటు శృంగార కోరికలు అదుపు చేసుకోవడం ఎలా సాధ్యం అవుతోంది. ఫిజికల్ గా ఎలా కంట్రోల్ చేసుకుంటారు. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోంది ? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయని యాంకర్ ప్రశ్నించారు. 

Bigg Boss Telugu 7

దీనికి శివాజీ బదులిస్తూ. హౌస్ లోపల మన చుట్టూ 360 డిగ్రీలలో కెమెరాలు ఉంటాయి.చివరకి బాత్రూమ్ వద్ద కూడా డోర్ తీసుకుని లోపాలకి వెళ్లెవరకు కెమెరాలో కనిపిస్తుంది. ప్రతి మూలలో కెమెరా కన్ను ఉంటుంది.అలాంటప్పుడు శారీరక సుఖాల గురించి  ఆలోచనలు రావు. 

Bigg Boss Telugu 7

ప్రతి కంటెస్టెంట్ పై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. నామినేషన్స్ లో ఎలాంటి పాయింట్ తీయాలి. నాగార్జున గారు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి.. గేమ్ ఎలా ఆడాలి ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచనలు శృంగారం వైపు వెళ్లవు అని శివాజీ తేల్చి చెప్పారు. ఎలాంటి ఏజ్ వారు ఉన్నా అలాంటి ఆలోచనలు బిగ్ బాస్ హౌస్ లో రావు అని శివాజీ అన్నారు. 

click me!