టాలీవుడ్ లో తనకి నచ్చిన హీరోల గురించి మాట్లాడుతూ శివాజీ ప్రస్తుతం ఉన్న యువ హీరోలని ప్రస్తావించారు. అల్లు అర్జున్ మాత్రం వేరే లెవల్ ఆరిస్ట్ అని శివాజీ ప్రశంసలు కురిపించారు. అలాగే జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటన చాలా సహజసిద్ధంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ కొన్ని పాత్రల్లో చాలా బాగా నటిస్తాడు. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా కూడా మంచి ఆర్టిస్ట్ అని శివాజీ తెలిపారు. దర్శకులలో అనిల్ రావిపూడి, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల, రామ్ అబ్బరాజు మంచి టాలెంట్ ఉన్న దర్శకులు అంటూ శివాజీ ప్రశంసించారు.