హీరోయిన్‌తో శేఖర్‌ మాస్టర్‌కి ఎఫైర్స్.. బయటపెట్టిన యాంకర్‌ శివ.. షో నుంచి వెళ్లిపోయిన స్టార్ కొరియోగ్రాఫర్‌

First Published Dec 23, 2023, 7:50 PM IST

శేఖర్‌ మాస్టర్‌పై ఎలాంటి కాంట్రవర్సీ లేదు, ఎలాంటి ఎఫైర్‌ రూమర్స్ కూడా లేవు. కానీ తాజాగా ఓ సంచలన రూమర్‌ వినిపించింది. హీరోయిన్‌తో ఆయనకు ఎఫైర్‌ ఉందని బాంబ్‌ పేల్చాడు యాంకర్‌. 
 

శేఖర్‌ మాస్టర్‌ ప్రస్తుతం తెలుగులో టాప్‌ డాన్సు మాస్టర్‌గా రాణిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌గా ఆయన పీక్‌లో ఉన్నారు. స్టార్‌ హీరోలందరికి డాన్సులు కంపోజ్‌ చేస్తూ స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచాడు. తీరిక లేకుండా ఉంటున్నాడు. కొరియోగ్రాఫర్‌గానే కాకుండా టీవీ షోస్‌కి ఆయన జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అందులో `డీ` షోకి ఆయన జడ్జ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందులో షాకింగ్‌ విషయం చోటు చేసుకుంది. 
 

`ఢీ` డాన్సు షో గత కొన్నేళ్లుగా విజయవంతంగా రన్‌ అవుతుంది. దీని నుంచి వెళ్లిన వాళ్లు ఇప్పుడు స్టార్‌ కొరియోగ్రాఫర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఈ షోకి జడ్జ్‌ లు తరచూ మారుతున్నారు. తాజాగా శేఖర్‌ మాస్టర్‌, హీరోయిన్‌ ప్రణీత జడ్జ్ లుగా ఉన్నారు. ప్రస్తుతం సెలబ్రిటీ ఢీ షో రన్ అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌ అవుతుంది. ఇందులో శేఖర్‌ మాస్టర్‌ పర్సనల్‌ విషయాలు బయటకు రావడం హాట్‌ టాపిక్ అవుతుంది. 
 

Latest Videos


ఇందులో సెలబ్రిటీలు, బిగ్‌ బాస్ కంటెస్టెంట్లు, ఇతర చిన్న పాటి సెలబ్రిటీలు డాన్సులు చేస్తున్నారు. చివర్లో యాంకర్‌ శివ వచ్చాడు. తను మైక్‌ తీసుకుని మాట్లాడుతూ, సడెన్‌గా శేఖర్‌ మాస్టర్‌ ఎఫైర్‌ విషయం బయటపెట్టాడు. ఆయనపై సంచలన ఆరోపణలు చేశాడు. మొదట సింపుల్‌గా ఓ ప్రశ్న అడుగుతాను మాస్టర్ అంటూ స్టార్ట్ చేశాడు శివ. 
 

శేఖర్‌ మాస్టర్‌ చెప్పు అనగానే, `మీకు ఓ హీరోయిన్‌తో ఎఫైర్‌ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి మాస్టర్` అని బాంబ్‌ పేల్చాడు యాంకర్‌ శివ. దీనికి శేఖర్‌ మాస్టర్ ఫైర్‌ అయ్యాడు. `ఏ ఎవర్రా వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది. అంతేకాదు షోలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. శేఖర్‌ మాస్టర్‌పై ఇలాంటి రూమర్‌ ఏంటని వాళ్లంతా ఆశ్చర్యపోయారు. 
 

దీనికి శేఖర్‌ మాస్టర్‌ అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యాడు. అయితే దీనికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు యాంకర్‌ శివ.. కానీ శేఖర్ మాస్టర్‌ గట్టిగా స్పందించాడు. నోరు మూసుకో ఇంకేం మాట్లాడొద్దు నువ్వు.. నాకో ఫ్యామిలీ ఉంది. పిల్లలున్నారు` అంటూ మండిపడ్డాడు. అంతేకాదు అతన్ని పంపిస్తారా? నన్ను వెళ్లిపోమ్మంటారా? అంటూ మరింతగా రెచ్చిపోయాడు శేఖర్‌ మాస్టర్‌. 
 

అయినా యాంకర్‌ శివ తన క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. శేఖర్‌ మాస్టర్‌ వినలేదు. కాసేపు చూసి ఆయనే షో నుంచి వెళ్లిపోయాడు. దీంతో అటు యాంకర్‌గా ఉన్న నందు, ఇతర కంటెస్టెంట్లు అంతా నోరెళ్లబెట్టారు. ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి. డాన్సులతో హోరెత్తిన షో ఒక్కసారిగా వేడెక్కింది. హాట్‌ హాట్‌ గా మారిపోయింది. 
 

ప్రస్తుతం `ఢీ సెలబ్రిటీ స్పెషల్‌` షో ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. 27న ప్రసారం కానుంది. అయితే నిజంగానే ఇందులో ఏమైనా ఉందా? లేక ఎప్పటిలాగే ఇదంతా ప్రాంక్‌ వ్యవహారమా? అనేది సందేహాలు కలుగుతున్నాయి. ఇక దీని ఫాలోవర్స్ మాత్రం ఇదంతా ప్రాంకే అని, ఇలాంటివి ఎన్ని చూడలేదు. ఆవేశంగా బయటకు వెళ్లిన శేఖర్‌ మాస్టర్‌ కాసేపు తర్వాత వచ్చి ప్రాంక్‌ అని బాంబ్‌ పేలుస్తాడు చూడు అని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ ప్రోమో మాత్రం ట్రెండ్‌ అవుతుంది. 
 

click me!